Weekend Relationship: పెళ్లి చేసుకొని కలివిడిగా కాదు.. విడివిడిగా బ్రతకుతారు.. ఎందుకో తెలుసా..?

సాధారణంగా రిలేషన్ షిప్ అంటే చూసి ఉంటారు. అందులో లవ్ రిలేషన్, మ్యారేజ్ రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్, లివింగ్ రిలేషన్ అని చాలా రకాలుంటాయి. వీటన్నింటి గురించి వినిఉంటారు. కానీ వీటన్నింటికీ భిన్నంగా పాత సంప్రదాయానికి చెక్ పెడుతూ వచ్చేసింది వీకెండ్ రిలేషన్ షిప్. పాశ్చాత్య దేశాల్లో ఇది సరికొత్త ట్రెండ్. దీనిపై ఒక లుక్కేద్దాం పదండి.

  • Written By:
  • Publish Date - March 20, 2023 / 03:00 PM IST

రిలేషన్ అంటే బంధం అని అర్థం. ఇది మనకు తెలిసిందే. అయితే వీకెండ్ రిలేషన్ అంటే కొత్తగా ఉంది కదూ.? దీని అర్థం వారాంతపు బంధమా అనే అనుమానం మీలో కలుగవచ్చు. అవును సరిగ్గా అదే. ఇలాంటి రిలేషన్స్ లో ఎవరు గడుపుతారు అనే ప్రశ్నకు సమాధానం కూడా ఉంది. ఇందులో కేవలం పెళ్లైన వారే ఉంటారు. ఎందుకు ఇలా సరికొత్త సంప్రదాయానికి స్వాగతం పలికారో ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లి అయ్యాక ప్రతిరోజూ ఒకరితో ఒకరు కలిసి బ్రతకాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటారు కొందరు. అలాంటి వారికి కాస్త ఉపశమనం కలిగించేందుకు దీనిని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ఇలా గడపవల్సి వచ్చిందో తెలుసా..? పెళ్లైన తరువాత భార్యతో భర్త.. భర్తతో భార్య ప్రేమగా, గౌరవంగా కలిగి ఉండాల్సి వస్తుంది. ఇలా ప్రతిరోజూ అంతే స్థాయిలో ప్రేమను, గౌరవాన్ని చూపించలేరు. అందుకే వారాంతంలో కలిసి ప్రేమగా గడిపేందుకు ఈ సంప్రదాయాన్ని ఎంచుకున్నారు.

ఈరకమైన సాంప్రదాయానికి తెరలేపింది జపాన్. ఇది ఇప్పుడిప్పుడే చిగురించిన ఆకుల్లాగా, ఉషోదయ కిరణంలా ప్రసరిస్తుంది. ఈ దేశంలో నివసిస్తున్న హిరోమి, హిడెకాజు అనే దంపతులు గత కొంత కాలంగా కలిసి జీవించారు. దీని ఫలితంగా వీరికి ఇక బిడ్డకూడా ఉంది. ఇలా మ్యరేజ్ రిలేషన్ లో గడిపినంత కాలం తమ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతున్న భావనకు గురైయ్యారు. ఇలా సరికొత్తగా జీవించడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయంటున్నారు ఈ వీకెండ్ దంపతులు.

భర్త ఎప్పుడైనా పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే.. భార్య కొన్ని పనులను స్వేచ్ఛగా చేయలేక ఒత్తిడికి లోనౌతుందట. ఇప్పుడు ఇలా వేరువేరుగా ఉండటం వల్ల ఆరకమైన ఒత్తిడి లేదని చెప్పుకొచ్చింది. అలాగే భర్తకూడా రాత్రంతా భార్యతో గడిపే సమయం ఉండేది కాదని దీనికి కారణం వర్క్ బిజీ అని చెప్పుకొచ్చాడు. దీంతో భార్య.. భర్త కోసం ఎదురుచూసి నిరుత్సాహానికి గురైయ్యేది. అందుకే ఒక అభిప్రాయానికి వచ్చి ఇలా వేరువేరుగా ఉండి వారానికి రెండు లేదా మూడు సార్లు కలిసేందుకు మక్కువ చూపుతున్నారు.

Japan Weekend Marriages

ఇప్పటి వరకూ చెప్పుకున్నది వారి మానసిక స్వేచ్ఛ గురించి మాత్రమే. ఇప్పుడు శారీరక స్వేచ్ఛ విషయానికి వద్దాం. ఇద్దరూ కలిసి ఉండటం వల్ల పని మొత్తం భార్య మీదే పడటం ప్రదాన సమస్య. దీంతో తీవ్ర శ్రమకు లోనైన భావనకు గురైయ్యేది ఆ మహిళ. అలాగే కలిసి ఉండటం వల్ల మహిళా ఆర్థిక స్వాతంత్ర్యం మీద కూడా దీని ప్రభావం పడుతుంది. అదే విడిపోయి బ్రతికితే ఎవరిపని వారే చేసుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. తద్వారా పెద్దగా శ్రమ అనిపించదు. అలాగే ఏదైనా కొనుగోలు చేయాలంటే భర్త అది ఎందుకు ఇది ఎందుకు అని భార్యకు అడ్డుపడుతూ ఉంటారు. అది కొత్త బట్టలు కొనుగోలు విషయంలో కావచ్చు. జ్యూవెలరీ విషయం కావచ్చు. ఏ ఇతర వ్యవహారాలు కావచ్చు. అప్పుడు ఆమె ఆర్థిక స్వేచ్ఛను హరించినట్లు భావిస్తుంది ఆ మహిళ. అదే విడిపోయి బ్రతికితే తన సంపాదన తాను చూసుకొని తనకు కావల్సిన వాటిని ఎవరి అభ్యంతరం లేకుండా కొనుగోలు చేసేందుకు ఆర్థిక స్వేచ్ఛ, వెసులుబాటు ఉంటుంది. అందుకే వీటికి ప్రోత్సహిస్తుంది జపాన్ యువత.

ఇక పిల్లల విషయంలో పూర్తి శ్రద్ద పురుషుల కంటే స్త్రీలే 5రెట్లు ఎక్కువగా శ్రమిస్తారని కొన్ని సర్వేల ఆధారంగా తెలుస్తుంది. తద్వారా వీకెండ్ మ్యారేజెస్ విధానాన్ని ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాగే పెళ్లి చేసుకొని కూడా బ్యాచ్ లర్ జీవనాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుంది. ఒకేచోట కలిసి ఉండకపోయినప్పటికీ పెళ్లి ద్వారా ఎమోషనల్ గా కలిసి ఉండేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. ఒంటరిగా ఉంటూనే భార్య గురించి యోగక్షేమాలను ఆలోచించవచ్చని ఆ అనుభూతి చాలా బాగుంటుందని అంటున్నారు.

పెళ్లి చేసుకుని దంపతులు అనేవారు కలివిడిగా ఉండకుండా విడివిడిగా ఉండటం ఏంటి. ఇలా ఉండే బదులు పెళ్లి కాకుండానే కలిసి గడపవచ్చు కదా అనే సందేహం మీలో కలుగవచ్చు. దీనికి వీరు చెప్పే సమాధానం ఏమిటో తెలుసా.. పెళ్లి చేసుకోవడం వల్ల నమ్మకమైన వ్యక్తి జీవితభాగస్వామి అవుతారు. ఈ భాగస్వామ్యాన్ని అలాగే కొనసాగించాలంటే ఇలా కొంత కుటుంబానికి, కొంత వ్యక్తిగత జీవితానికి సమయాన్ని సమానంగా కేటాయించడం వల్ల తమ ఇరువురికి స్వేచ్ఛతో కూడిన జీవితం సాఫీగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే పెళ్లి లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. పెళ్లి కావాలి.. భార్య కావాలి.. వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి. అందుకే ఈ మార్గాన్ని ఎన్నుకున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ ట్రెండ్ ను ఎంతమంది అవలంభిస్తారో చూడాలి.

 

 

T.V.SRIKAR