Tarakaratna: తారకరత్న పునర్జన్మ.. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది ?

సైన్స్‌ పరంగా ఇదంతా వట్టి ట్రాష్‌లా కనిపించినా.. జోతిష్యం పరంగా పునర్జన్మ ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు జోతిష్యులు. కొన్ని ప్రత్యేకమై రోజుల్లో చనిపోయిన వారు ఖచ్చితంగా తిరిగి జన్మిస్తారట.

  • Written By:
  • Publish Date - March 2, 2023 / 01:28 PM IST

మనిషి పునర్జన్మ గురించి చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. ఒకసారి చనిపోయిన మనిషి మళ్లీ పుడతాడా అంటే. లేదు అనేవాళ్లు ఎంత మంది ఉంటారో.. అవును అనేవాళ్లు కూడా అంతేమంది ఉంటారు. సైన్స్‌ పరంగా ఇదంతా వట్టి ట్రాష్‌లా కనిపించినా.. జోతిష్యం పరంగా పునర్జన్మ ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు జోతిష్యులు. కొన్ని ప్రత్యేకమై రోజుల్లో చనిపోయిన వారు ఖచ్చితంగా తిరిగి జన్మిస్తారట.

ఇప్పుడు తారకరత్న విషయంలో కూడా జోతిష్యులు ఇదే చెప్తున్నారు. దాదాపు నెల రోజులు మృత్యువుతో పోరాడిన తారకరత్న.. సరిగ్గా శివరాత్రి రోజు ప్రాణాలు కోల్పోయాడు. శివరాత్రి అనేది చాలా పవిత్రమైన రోజు. శివుడు జన్మించిన ఈ రోజు చనిపోయినవాళ్లంతా శివుడిలో కలిసిపోతారని మన జ్యోతిష్యశ్రాస్త్రం చెప్తోంది. వీళ్లందరికీ ఖచ్చతంగా పునర్జన్మ ఉంటుంది అనేది కూడా మన శాస్త్రాల్లో ఉంది.

దీని ప్రకారం తారకరత్న మళ్లీ ఖచ్చితంగా జన్మిస్తాడు అంటున్నారు జ్యోతిష్యులు. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప శివరాత్రి రోజు చనిపోయే అవకాశం రాదట. అలాంటి పవిత్ర దినాన ప్రాణాలు వదిలేశాడు కాబట్టి.. మళ్లీ తారకరత్న ఖచ్చితంగా పుడతాడు అంటున్నారు జోతిష్యులు. దీంతో నందమూరి భిమానులు తెగ ఆనందపడిపోతున్నారు.