Whatsapp new feature: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. రెండో అకౌంట్ యాడ్ చేయొచ్చు !

ఇకపై.. ఒక మొబైల్‌లోని, ఒక వాట్సాప్ యాప్‌లో ఏకంగా రెండు నెంబర్లతో రెండు అకౌంట్లు వాడుకోడానికి అవకాశం దొరకనుంది. ఇప్పటి వరకు మొబైల్‌లో రెండు సిమ్ లు ఉన్నా సరే.. ఒకే వాట్సాప్ వాడుకోడానికి అవకాశం ఉండేది.

  • Written By:
  • Publish Date - February 23, 2024 / 05:27 PM IST

Whatsapp new feature: ఒక యాప్‌లో మరో అకౌంట్ క్రియేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది వాట్సాప్‌. ఇకపై.. ఒక మొబైల్‌లోని, ఒక వాట్సాప్ యాప్‌లో ఏకంగా రెండు నెంబర్లతో రెండు అకౌంట్లు వాడుకోడానికి అవకాశం దొరకనుంది. పొద్దున లేచింది మొదలు వాట్సాప్ చూడందే చాలామందికి రోజు గడవదు. చాలామందికి ఇప్పుడు అవసరంగా కూడా మారింది. టెక్ట్స్ మెసేజీల దగ్గర నుంచి వీడియోల దాకా క్షణాల్లో పంపించుకోవడానికి ఇందులో అవకాశం ఉంది.

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధం!

భారత్‌లో కోట్ల మంది వినియోగదారులు దీన్ని వాడుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందిస్తోంది వాట్సాప్. లేటెస్ట్‌గా వచ్చిన ఈ ఫీచర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు మొబైల్‌లో రెండు సిమ్ లు ఉన్నా సరే.. ఒకే వాట్సాప్ వాడుకోడానికి అవకాశం ఉండేది. రెండో సిమ్ ద్వారా వాట్సాప్ కావాలనుకుంటే.. చాలామంది క్లోనింగ్ యాప్‌ను వాడేవాళ్ళు. కానీ ఇది అంత సేఫ్టీ కాకపోవడంతో.. వాట్సాప్‌లోనే మరో అకౌంట్ క్రియేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. అంటే వాట్సాప్ ఒకే యాప్‌లో రెండు నెంబర్లతో, రెండు అకౌంట్లను వాడుకోవచ్చు.
ఎలా క్రియేట్ చేయాలంటే..
వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, అక్కడ అకౌంట్ సెక్షన్‌ని క్లిక్ చేయాలి. అందులో యాడ్ అకౌంట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు రెండో అకౌంట్ కోసం నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్‌లో ఉన్న రెండో సిమ్ నెంబర్‌ను అందులో ఎంటర్ చేస్తే చాలు.. రెండో అకౌంట్ క్రియేట్ అవుతుంది. మీ ప్రొఫైల్ మార్చుకొని రెండో అకౌంట్‌ని ఇతర అవసరాలకు వాడుకునే అవకాశం ఉంటుంది. ఈమధ్యే టెక్ట్స్‌ను హైలెట్ చేస్తూ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. ఇప్పుడు టూ అకౌంట్స్ ఫీచర్ మరింత హైలెట్ కానుంది. అయితే టెలిగ్రామ్‌లో ఇలాంటి సౌకర్యం ఎప్పటి నుంచో ఉంది.