WhatsApp: ఈ రోజుల్లో వాట్సాప్ వాడని వాళ్లు అరుదు. కమ్యూనికేషన్ విషయంలో వాట్సాప్ ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని విషయాల్ని వాట్సాప్‌లో షేర్ చేసుకోవచ్చు. కానీ, కొన్నిసార్లు కావాల్సిన వాళ్లు మీ నెంబర్ బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది. మరైతే.. మీ నెంబర్ వాట్సాప్‌లో బ్లాక్ చేశారో.. లేదో.. తెలుసుకోవడం ఎలా..? ఇదేమంత కష్టం కాదు. కొన్ని చిన్న ట్రిక్స్ ఫాలో అయితే.. మీ నెంబర్ ఎవరు బ్లాక్ చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ టెక్నిక్సే ఇవి.
REVANTH VS NANI: కొడాలి నానిని రానీయొద్దు! నో ఎంట్రీ అంటున్న రేవంత్..
ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారేమో అనే అనుమానం వస్తే.. వాట్సాప్‌లో వారి ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. మీ కాంటాక్ట్ లిస్టులో వారి నెంబర్ సేవ్ అయి ఉండాలి. అప్పుడు వారి ప్రొఫైల్ మీకు కనిపించిందో.. మిమ్మల్ని బ్లాక్ చేయలేదని అర్థం. అదే ప్రొఫైల్ మీకు కనిపించడం లేదంటే వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం. అలాగే మీరు వేరేవాళ్లను బ్లాక్ చేస్తే.. మీ ప్రొఫైల్ కూడా వారికి కనిపించదు. అయితే, ఈ ఒక్కదాన్ని బట్టే బ్లాక్ చేశారని నిర్ధరణకు రావడానికి వీల్లేదు. మిగతా అంశాల్ని కూడా పరిశీలించాలి. వాళ్ల లాస్ట్ సీన్ మీకు కనిపించకపోతే బహుశా బ్లాక్ చేసి ఉండొచ్చు. అయితే, వాళ్లు ప్రైవసీలో లాస్ట్ సీన్ డిజేబుల్ చేసి ఉంటే.. మిమ్మల్ని బ్లాక్ చేయకపోయినా అది మీకు కనిపించదు.
కానీ, వాళ్లు ప్రైవసీలో అలాంటి సెట్టింగ్స్ చేసుకోకుండా ఉండి కూడా ఆన్‌లైన్‌లో కనిపించకున్నా.. లాస్ట్ సీన్ కనిపించకుండా ఉంటే మాత్రం బ్లాక్ చేసినట్లే. బ్లాక్ చేశారో లేదో తెలుసుకునేందుకు మరో ట్రిక్ కూడా ఉంది. అదే వారికి మెసేజ్ చేయడం. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే వారికి మీ మెసేజ్ వెళ్లదు. ఎప్పుడూ ఒకటే టిక్ కనిపిస్తుంది. సాధారణంగా మీకు లేదా వారికి ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే.. మెసేజ్ వెళ్లదు. అలాంటప్పుడు ఒక్క టిక్కే కనిపిస్తుంది. కానీ, ఆ తర్వాత నెట్ కనెక్ట్ కాగానే.. రెండు టిక్స్, ఆ మెసేజ్ చూస్తే.. బ్లూ టిక్స్ వస్తాయి. కానీ, అలా కాకుండా.. మెసేజ్ పంపి చాలా కాలం అయినప్పటికీ, వాళ్లు వాట్సాప్ వాడుతూనే ఉన్నప్పటికీ మీ మెసేజ్ ఒకే టిక్ చూపిస్తుంటే.. వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం. బ్లాక్ చేసిన వాళ్లకు మనం మెసేజ్ చేయలేమనే సంగతి తెలిసిందే. అలాగే వాట్సాప్ కాల్.. మరో ఆప్షన్. మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మీరు వాట్సాప్ కాల్ చేయలేరు.
అయితే, నెట్ లేనప్పుడు ఎలాగూ కాల్ కనెక్ట్ కాదు. కానీ, ఇద్దరికీ నెట్ ఉండి.. కాల్ కనెక్ట్ అవ్వడం లేదంటే కచ్చితంగా మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం. అయితే, వాళ్లు వాట్సాప్ వాడుతున్నారు.. నెట్ ఉంది.. అని తెలియాలంటే వేరే వాళ్లతో కూడా మెసేజ్ పంపడమో.. కాల్ చేయడమో చేయాలి. వాళ్ల మెసేజెస్ వెళ్లి, కాల్ కనెక్ట్ అయి.. మీకు మాత్రం అలా కాకుంటే బ్లాక్ చేసినట్లే. ఈ విషయం తెలుసుకోవడానికి ఉన్న మరో ఆప్షన్.. వారి నెంబర్‌ను గ్రూప్‌లో యాడ్ చేయడం. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే.. వారి నెంబర్‌ను మీరు ఒక గ్రూప్‌లో యాడ్ చేయలేరు. కాబట్టి.. ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుమానం ఉంటే.. ఇవన్నీ ట్రై చేసి, ఒక నిర్ధరణకు రావడం మంచిది.