Laughing Buddha: లాఫింగ్‌ బుద్ధ ఎవరు.. దేవుడి గుడిలో బొమ్మ పెట్టొచ్చా..?

లాఫింగ్ బుద్ధ విగ్రహం అలంకార వస్తువు కాదు. దాన్ని సరైన దిశలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ సరైన దిశలో లేకపోతే.. దాని నుంచి రావాల్సిన మంచి ఫలితాలు రావు. అందుకే ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకోవడానికి ముందు సరైన దిశలో పెట్టాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 06:34 PM IST

Laughing Buddha: లాఫింగ్‌ బుద్ధ విగ్రహం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆఫీస్ టేబుల్‌ పైన, ఇళ్లలో ఈ విగ్రహం పెట్టుకుంటారు. ఇది వాస్తు ప్రకారం కూడా మంచిదే. అయితే ఎక్కడ పడితే అక్కడ పెడితేనే కొంప మునుగుతుంది. లాఫింగ్ బుద్ధ విగ్రహం అలంకార వస్తువు కాదు. దాన్ని సరైన దిశలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ సరైన దిశలో లేకపోతే.. దాని నుంచి రావాల్సిన మంచి ఫలితాలు రావు. అందుకే ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకోవడానికి ముందు సరైన దిశలో పెట్టాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

KTR: హీరోయిన్‌ రష్మిక వీడియోపై కేటీఆర్‌ రియాక్షన్‌..

అసలు లాఫింగ్ బుద్ధ (Laughing Buddha) ఎవరంటే.. దీని వెనక పెద్ద కథ ఉంది. జపాన్ (JAPAN) నివాసి హోతాయ్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. హోతాయ్ కఠోర తపస్సు చేయడం ద్వారా జ్ఞానోదయం పొందాడు. జ్ఞానం సంపాదించిన తర్వాత హొతాయ్ బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడట. జీవితంలో జనాలను నవ్వించడానికే పని చేస్తానని నిర్ణయించుకున్నాడు. హొతాయ్ అనేక దేశాలు పర్యటించాడు. అతడు ఎక్కడికి వెళ్లినా ప్రజలను నవ్విస్తూ, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపాడు. అందుకే లాఫింగ్ బుద్ధ అనే పేరు వచ్చింది. లాఫింగ్ బుద్ధను ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. లాఫింగ్ బుద్ధుని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి ఆనందం, సంపద వచ్చి చేరుతుంది. అదే సమయంలో ఇంట్లోని నెగెటివిటి తొలగిపోతుంది. ఫలితంగా ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. లాఫింగ్ బుద్ధ ఎక్కడ పెట్టుకోవాలనే విషయం గురించి వాస్తు చాలా స్పష్టమైన వివరణలు ఇచ్చింది. లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఉండాలి. తూర్పు వైపున లాఫింగ్ బుద్ధని పెట్టడం శుభప్రదం.

ICC RANKINGS: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ నెం.1.. నెంబర్ వన్ బ్యాటర్ ఎవరంటే..

పిల్లల స్టడి రూమ్‌లో లాఫింగ్ బుద్దుని విగ్రహం పెడితే అది పిల్లల మనస్సుపై సానుకూల ప్రభావం చూపుతుంది. పిల్లల మనసు ఏకాగ్రతతో చదువులో నమగ్నం అవుతారు. ఆఫీస్ డెస్క్ మీద పెట్టుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార స్థలంలో లాఫింగ్ బుద్ధను పెట్టుకోవడం వల్ల వ్యాపారం క్రమంగా మెరుగుపడుతుంది. బంగారు నాణేలు మోస్తున్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదని వాస్తు చెబుతోంది. మీ గదిలో లాఫింగ్ బుద్ధ పెట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తులను నిరోధించవచ్చు. బంగారు రంగులో ఉండేది మరింత మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.