Women : మహిళలు ఏడిస్తే మగవాళ్లు ఎందుకు కంట్రోల్‌ అవుతారు.. ఇంట్రెస్టింగ్‌ విషయం చెప్పిన శాస్త్రవేత్తలు..

రిలేషన్‌షిప్‌ అన్న తరువాత గొడవలు చాలా కామన్‌. అది ప్రేమైనా, స్నేహమైనా ఖచ్చితంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ప్రతీ గొడవలో దాదాపుగా ఆడవాళ్లే ఎక్కువగా ఏడుస్తుంటారు. వాళ్లు అలా ఏడుస్తారో లేదో.. మగవాళ్లు వాదన ఆపేస్తారు. తప్పు ఉన్నా లేకపోయినా.. వాళ్ల ఏడుపును ఆపేందుకు గొడవ పక్కన సెట్టి సైలెంట్‌ అవుతారు.

రిలేషన్‌షిప్‌ అన్న తరువాత గొడవలు చాలా కామన్‌. అది ప్రేమైనా, స్నేహమైనా ఖచ్చితంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ప్రతీ గొడవలో దాదాపుగా ఆడవాళ్లే ఎక్కువగా ఏడుస్తుంటారు. వాళ్లు అలా ఏడుస్తారో లేదో.. మగవాళ్లు వాదన ఆపేస్తారు. తప్పు ఉన్నా లేకపోయినా.. వాళ్ల ఏడుపును ఆపేందుకు గొడవ పక్కన సెట్టి సైలెంట్‌ అవుతారు. ఇంకా ఎక్కువ ప్రేమ ఉన్నవాళ్లైతే సారీ కూడా చెప్తారు. ఆడవాళ్లు ఏడవగానే మగవాళ్ల కోపం కంట్రోల్‌ అవడం వెనక ఎమోషనల్‌ రీజన్‌ మాత్రమే కాదు. సైంటిఫిక్‌ రీజన్‌ కూడా ఉందంటున్నారు డాక్టర్లు. ఆడవాళ్ల కన్నీళ్లు మగవాళ్లపై చూపే ప్రభావం గురించి ఇజ్రాయెల్‌ దేశానికి చెందిన వీజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సైంటిస్టులు పరిశోధనలు చేశారు.

ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాలను గుర్తించారట శాస్త్రవేత్తలు.
ఆడవాళ్ల కన్నీళ్లలో ఉండే కొన్ని రసాయణాలు మగవాళ్ల మెదడుపై ప్రభావం చూపిస్తాయట. చాలా మంది గుర్తించికపోయినా.. ఆడవాళ్ల కన్నీటి నుంచి వచ్చే వాసన కారణంగా మగవారి బ్రెయిన్‌లో మార్పులు జరిగి కోపం కంట్రోల్‌ అవ్వడం. ఆవేశం తగ్గడం లాంటి పనులు జరుగుతాయట. అయితే ఇది అందరి వ్యక్తుల్లో ఒకేలా ఉండదని కూడా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. వాళ్లు కొందరు వ్యక్తులపై జరిపిన ప్రయోగాల్లో దాదాపుగా ఇదే రిజల్ట్‌ రావడంతో.. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. వ్యక్తిని బట్టి బ్రెయిన్‌లో వచ్చే మార్పుల్లో కాస్త తేడా ఉండొచ్చని చెప్తున్నారు. కానీ దాదాపు ఎక్కువ మంది మగవాళ్లు మాత్రం ఆడవాళ్ల కన్నీటికి కంట్రోల్‌ అవుతారని చెప్తున్నారు. దీంతో ఆడవాళ్ల ఏడుపుకు మగవాళ్లు కంట్రోల్‌ అవడం వెనక ఎమోషనల్‌ రీజన్‌తో పాటు సైంటిఫిక్‌ రీజన్‌ కూడా ఉండటం ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌గా నిలిచింది.