Republic Day: రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. కర్తవ్యపథ్‌లోనే ఎందుకు..?

1911లో బ్రిటీష్ ప్రభుత్వం.. కోల్‌కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చాలనుకుని, కర్తవ్యపథ్‌ను నిర్మించారు. దీనికి అంతకుముందు రాజ్‌పథ్ అనే పేరు ఉండేది. దీనికి ముందు బ్రిటీష్ వారి హయాంలో కింగ్స్ వే అనే వాళ్లు.

  • Written By:
  • Publish Date - January 25, 2024 / 04:00 PM IST

Republic Day: దేశ రాజధానిలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దేశమంతా ఈ వేడుకలవైపే చూస్తుంది. న్యూ ఢిల్లీలోని కర్తవ్యపథ్‌‌లో ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ఇక్కడ పరేడ్, త్రివిధ దళాల కవాతు, సైనిక ప్రదర్శనలు వంటివి ఉంటాయి. అయితే.. కర్తవ్యపథ్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు జరిగేందుకు చారిత్రక నేపథ్యం ఉంది. కర్తవ్యపథ్.. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉంటుంది.

YS SHARMILA: వైఎస్ కుటుంబం చీలడానికి జగనే కారణం.. జగన్ ఒక నియంత: వైఎస్ షర్మిల

1911లో బ్రిటీష్ ప్రభుత్వం.. కోల్‌కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చాలనుకుని, కర్తవ్యపథ్‌ను నిర్మించారు. దీనికి అంతకుముందు రాజ్‌పథ్ అనే పేరు ఉండేది. దీనికి ముందు బ్రిటీష్ వారి హయాంలో కింగ్స్ వే అనే వాళ్లు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటీష్ వారు పెట్టిన పేర్లు మార్చేయాలనే ఉద్దేశంతో దీనికి కర్తవ్యపథ్ అనే పేరు పెట్టింది. 2022 సెప్టెంబర్‌లో సెంట్రల్ విస్టా డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా దీనికి కర్తవ్యపథ్ అనే పేరు పెట్టారు. ఈసారి కూడా కర్తవ్యపథ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరగబోతున్నాయి. ఇందుకు ఘనమైన ఏర్పాట్లు సాగుతున్నాయి. 14 వేల మంది భద్రతాసిబ్బందిని మోహరించారు. కమాండోలు, క్విక్ రెస్పాన్స్ యాక్షన్ ఫోర్స్, పీసీఆర్ వ్యాన్లు పని చేస్తున్నాయి.

వేడుకలు తిలకించేందుకు 77 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ థీమ్‌లుగా ఇండియా: మదర్ ఆఫ్ డెమోక్రసీ, వికసిత్ భారత్‌గా ఎంపిక చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విదేశాలకు చెందిన ప్రత్యేక అతిథి హాజరుకానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇది 75వ గణతంత్ర దినోత్సవం కావడం విశేషం.