Wife Last Wish: పుట్టుక ఒక మలుపు.. చావు ఒక గెలుపు.. ఇది తెలుసుకుంటే చావు కూడా ఒక సంబరంలా ఉంటుందని ఈ మధ్యే బ్రోలో ఓ డైలాగ్ వదిలాడు పవన్. చావు గురించి చర్చించుకునేలా చేశాడు. ఎంత బతికినా.. ఎలా బతికినా.. ఏదో ఒక రోజు చావు వస్తుంది.. చనిపోయే ఆ క్షణం ముందు ఏం చేశామన్నదే.. ఆ తర్వాత మనల్ని గుర్తు పెట్టుకునేలా చేస్తుంది. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. చావుకు దగ్గరయిన ఓ మహిళ కథ ఇది. తాను చనిపోతానని తెలిసి.. భర్తను ఆ మహిళ అడిగిన చివరి కోరిక గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.
ఏ మనిషి అయినా.. చివరి రోజుల్లో ఉన్నాడంటే.. తనకు నచ్చిన వారితో సమయం గడపాలని అనుకుంటాడు. ఆత్మీయుల మధ్య తుదిశ్వాస విడవాలని కోరుకుంటాడు. ఐతే ఓ మహిళ మాత్రం.. భర్తను వింత కోరిక కోరింది. రెడిట్ అనే యాప్‌లో ఈ స్టోరీ షేర్ చేశాడు. అది కాస్త ఇన్‌స్టా, ఎఫ్‌బీ, ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఓ మహిళ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతోంది. ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ ఇచ్చినా ఆమె బతకదని డాక్టర్లు చెప్పేశారు. దీంతో చివరి క్షణాల్లో అడిగినవన్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఆమె భర్త. చివరి కోరిక ఏంటి అని అడిగితే.. ఆమె చెప్పిన మాటకు ఆ భర్తకు గుండె ఆగినంత పని అయింది.
తన మాజీ ప్రియుడితో ఒక్క రాత్రి గడపాలని ఉంది అని చెప్పింది. దీంతో అతనికి మైండ్ బ్లాంక్ అయింది. భార్య చివరి కోరికను కాదనలేడు.. అలా అని ఓ భర్తగా దీన్ని అంగీకరించలేడు.. ఇంతకుమించి దారుణం మరొకటి ఉండదు. దీంతో ఆ భర్త పరిస్థితి ఎవరికీ రావొద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయ్.