Work From Office: మ్రోగిన ఆఫీసు గంట.. అంగీకరించకుంటే ఉద్యోగికి కొరడా..

ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ తో పనిచేయవలసిన పరిస్థితి వచ్చేసింది. చిన్న రెస్టారెంట్ మొదలు పెద్ద పెద్ద మల్టీనేషన్ సాఫ్ట్ వేర్ కంపెనీ వరకు అందరూ గణన యంత్రాలనే ఉపయోగిస్తున్నాయి. అయితే వీటిని ఒకప్పుడు ఆఫీసుల్లో ఒక డెస్క్ కు ఏర్పాటు చేసి ఒక్కొక్క ఉద్యోగికి ఒక్కో క్యాబిన్ ఇచ్చేవారు. తోటి వారితో పక్కపక్కనే కూర్చొని పనిచేసే విధానం అమల్లోకి వచ్చింది. కోవిడ్ పుణ్యమా అని ఇది కాస్త సరికొత్తగా రూపాంతరం చెందింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు.. సంస్థ దెబ్బతినకుండా ఉండేందుకు ఇంటి నుంచే పనిచేయమని మొదట కొన్ని కంపెనీలు ప్రతిపాధించాయి.

  • Written By:
  • Updated On - April 16, 2023 / 07:40 PM IST

ఈ విధానం క్రమక్రమంగా చిన్న కంపెనీలకు కూడా వ్యాపించింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చక్కబడినట్లు కనిపిస్తుంది. కోవిడ్ కేసులు కూడా అంతగా విజృంభించడం లేదు. అందుకే ఇంటి నుంచి సంస్థలోకి వచ్చి పనిచేయమని అంటున్నాయి చాలా సంస్థలు. మునుపటి వర్క్ ఫ్రం ఆఫీస్ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ – 2022 ఏడాది చివర్లో ఒక పరిశోధనను నిర్వహించింది. అందులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదికలో పొందుపరిచిన అంశాలను ఇప్పుడు చూద్దాం.

రిమోట్ కల్చర్ కు స్వస్తి:
వర్క్ ఫ్రం హోంను రిమోట్ కల్చర్ అని కూడా అంటారు. రిమోట్ అనే పదంలోనే ఉంది మనం ఏదైనా వస్తువుకు దగ్గరగా వెళ్లకుండా దూరంగా ఉండే ఆపరే‌ట్ చేయడం. అలాగే ఇక్కడ సంస్థకు మనం రిమోట్ అనమాట. ఆఫీసులోని సిస్టం ముందు కూర్చొనే కాకుండా ఎక్కడి నుంచి అయినా నెట్వర్క్ అనే సాధనంతో కంపెనీ చెప్పే పనిని తన వ్యక్తి గత డొమైన్ నుంచి చేయవచ్చు. అయితే ఈ పద్దతికి స్వస్థి పలుకుతూ కొన్ని కంపెనీలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఎందుకు ఇలా తీసుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందా.

ఉత్పాదకతపై ప్రభావం:
గతానికి ప్రస్తుతానికి తేడాలు గమనిస్తే కంపెనీల ఉత్పాదకతలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నట్లు ఈ నివేదిక తెలుపుతోంది. ఒకప్పడు ఏదైనా ప్రాజెక్ట్ టేకోవర్ ను మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేసేవారు. తద్వారా మరిన్ని సరికొత్త ప్రాజెక్టులు అందిపుచ్చుకునే అవకాశం ఉండేది. కానీ కోవిడి తరువాత కంపెనీ పరితీరులో వచ్చిన మార్పు కారణంగా ప్రాజక్ట్ కాల వ్యవధి గరిష్ట స్థాయికి పెరిగిపోతుంది. అనుకున్న సమయం కన్నా ఎక్కువ రోజులు వెచ్చించాల్సి వస్తుంది. దీంతో బాగా తక్కువ కాలంలో తమ పనిని పూర్తి చేసే సంస్థల వైపుకే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వెళ్లిపోతున్నాయి. తద్వారా ఉత్పాదక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది అని నివేదిక సారాంశం.

ఉద్యోగి పనితీరు:
సాధారణంగా ఎక్కడైనా ఉద్యోగుల పని తీరు మెరుగుగా ఉండాలంటే వారికి ఒక బాధ్యతను నిర్ధిష్టమైన కాల వ్యవధిలో ముగించాలని మార్గదర్శకాలు జారీచేస్తారు. దీనికి సంబంధించి పర్యవేక్షణ కోసం ఒకరిని టీం లీడర్ గా నియమిస్తారు. వారిపై మరో మేనేజర్ ఆపై జనరల్ మేనేజర్ ఇలా చైన్ లింక్ హైయార్కీ ఉంటుంది. వీరు ఆఫీసు నుంచి అయితే బాగా అడ్మినిస్ట్రేషన్ చేయగలరు. అదే ఉద్యోగులను ఇంటి నుంచి చేయమని పని పురమాయిస్తే అంత ఎఫెక్టీవ్ గా చేసే పరిస్థితి ఉండదు. రకరకాల కారణాలతో పనిని జాప్యం చేస్తూ వస్తారు. ఇంటర్ నెట్ కనెక్టివిటీ, పవర్ కట్ సమస్య, అనారోగ్య సమస్య ఇలా ఏదో ఒకటి చెప్పి రెండు రోజుల్లో అవ్వాల్సిన పనిని వారం చేస్తూ కాలయాపన చేస్తారు. అలాగే ఎక్కవ పని ఒత్తిడిని తీసుకోకుండా చేసినంత చేసి షిప్ట్ సమయాన్ని సరిపెట్టేస్తారు. అలా ఉద్యోగుల పనితీరు పై దీని ప్రభావం పడుతోంది. అందుకే ఆఫీసులకు వచ్చి పని చేయాల్సిందిగా లేకుంటే పని నుంచి తొలగిస్తామని కూడా హెచ్చరికలను నోటీసుల రూపంలో అందజేస్తున్నారు. అలా నోటీసులు తీసుకొని కూడా ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ అనేలా ధీమా వ్యక్తం చేస్తున్నారు కొందరు ఉద్యోగులు.

శక్తి సామర్థ్యాలు:
మనం చేసే పనిలో ఎవరైనా చూసేది మన సర్టిఫికేట్లో, అనుభవమో కాదు. అది కేవలం లోనికి ప్రవేశించే వరకు ఎంట్రీ పాస్ లాగా మాత్రమే ఉపయోగపడతాయి. ఆతరువాత పనిలో శక్తి సామర్థ్యాలు చూపించాల్సి వస్తుంది. ఈ ఆన్ లైన్ విధానం వల్ల వాటికి అవకాశం ఉండదు. ఉన్నప్పటికీ సంస్థలో పనిచేసే వారందరూ అంత నిక్కచ్చిగా పనిచేస్తారన్న గ్యారెంటీ లేదు. అందుకే ప్రత్యక్షంగా కంపెనీల్లోకి వచ్చి కంపూటర్ల ముందు కూర్చుంటే వారిని రోజూ వారీ నిర్ధేశించిన టార్గెట్ ని పూర్తి చేస్తారా లేదా తెలిసిపోతుంది. అప్పుడు అవసరమైన వారిని పనిలో కొసాగిస్తూ అనవసరమైన వారిని పనిలో నుంచి తీసేందుకు వీలు ఉంటుంది. దీనికి కొందరు నిరాకరిస్తున్నారు. దీనికి కారణం ఇంట్లో అయితే నిదానంగా లేచి ల్యాప్ టాప్ లు ఆన్ చేసి లాగిన్ అవ్వచ్చు. దాదాపు రెండు గంటలు మీటింగ్ లోనే సరిపోతుంది. ఆ మీటింగ్ కూడా పాయింట్ టు పాయింట్ వినేవారు వేళ్లలో లెక్కపెట్టేలా ఉంటారు. అలా కాకుండా చెప్పిన పనిని చెప్పినట్లు చేసుకుంటూ పోయే వారు చాలా అరుదు. అందుకే అలాంటి వారిని తొలగించి మంచి సామర్థవంతంగా పనిచేసేవారిని నియమించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పైగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలు విధుల నుంచి తొలగిస్తున్న తరుణంలో తమ కంపెనీ ప్రతినిధుల పనితీరును కూడా గమనించి అనవసరమైన వారిని తొలగించాలనే యోచలో ఉన్నాయి.

నివేదిక లెక్కలు ఇలా:
పైన తెలిపిన కారణాల ఆధారంగానే ఈ పరిశోధనను చేపట్టాయి. 2021 జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి చేసిన సర్వేలో.. 60.1 శాతం మందికి వర్క్ ఫ్రం హోం విధానానికి చెక్ పెట్టినట్లు తెలుస్తుంది. అలాగే 2022 విషయానికొస్తే.. ఆగస్ట్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ చేసిన సర్వేలో 72.5 శాతం మందికి రిమోట్ కల్చర్ విధానానికి స్వస్తి పలికినట్టు బీఎల్ఎస్ నివేదిక పేర్కొంది. అంటే గత ఏడాది కంటే మునుపటి సంవత్సరం ప్రతి వంద మందిలో 60 మంది ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పనిచేయమని కోరితే.. 2022లో మాత్రం ఈ సంఖ్య 12.4 శాతం పెరిగి 72 మందికి పైగా వర్క్ ఫ్రం ఆఫీస్ అనేలా మార్గదర్శకాలు జారీ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఒకప్పుడు ఆఫీసులో ఉద్యోగులకు కల్పించే రకరకాల సేవల ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఇంటి నుంచే పనిచేయమన్న సంస్థలు ఇప్పుడు కార్యాలయానికి వచ్చి చేయమని ఆదేశాలు జారీ చేస్తున్నాయి.

 

T.V.SRIKAR