అమెరికా, సౌత్ కొరియాలు అణుయుద్ధానికి సంకేతాలిస్తున్నాయంటూ రీసెంట్‌గా కిమ్ జాంగ్ ఉన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ఆయన చెప్పినట్టుగానే రెండే దేశాల మధ్య యుద్ధం జరిగితే దాని ప్రభావం మొత్తం ప్రపంచంమీద పడుతుంది. ఒక్క అణుబాంబు దాడి జరిగితే ఆ ఎఫెక్ట్ నుంచి కోలుకునేందుకు జపాన్‌కు ఎన్నేళ్లు పట్టిందో ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు అమెరికా, సౌత్ కొరియా, నార్త్ కొరియాల మధ్య అణుయుద్ధం జరిగితే మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుంది.
ప్రజెంట్ అమెరికా-సౌత్ కొరియా మిలిటరీ యాక్షన్స్‌తో నార్త్ కొరియా బోర్డర్‌లో ఆల్రెడీ వార్‌సీన్ కనిపిస్తోంది. అమెరికాకు తన బలం చూపేందుకు నార్త్ కొరియా కూడా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. రీసెంట్‌గా డమ్మీ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ టెస్ట్ నిర్వహించింది. తమ దమ్మేంటో చూపిస్తూ రెండు దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకు ఈ ప్రయోగం చేసింది. ఈ బాలిస్టిక్ మిస్సైల్ 8 వందల కిలోమీటర్లు ప్రయాణించి 8 వందల మీటర్ల ఎత్తులో టార్గెట్‌ను ఢీ కొట్టింది.
ఇలాంటివి ఒకే వారంలో 4 టెస్ట్‌లు చేసింది నార్త్ కొరియా. యుద్ధంలో రివర్స్ ఎటాక్ చేయడానికి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ విన్యాసాలు చేపట్టినట్టు నార్త్ కొరియా మీడియా సంస్థలు వెల్లడించాయి. అంతే కాకుండా అమెరికాకు వ్యతిరేకంగా పోరాడేందుకు దాదాపు 8 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేసినట్లు ఉత్తర కొరియా ఎనౌన్స్ చేసింది. సాధారణంగానే కిమ్ తీసుకునే నిర్ణయాలు చాలా డేంజరెస్‌గా ఉంటాయి.
దానికి తోడు ఇప్పుడు రెండు దేశాలు కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్‌లో నార్త్ కొరియా తీసుకునే నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ మొదలైంది. మూడు దేశాలు ప్రపంచ భద్రత గురించి ఆలోచించాలని మిగిలిన దేశాలు కోరుతున్నాయి. కానీ నార్త్ కొరియా, సౌత్ కొరియా మాత్రం కయ్యానికి కాలు దువ్వుతూ టెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి చూస్తుంటే.. అణుయుద్ధం తప్పదు అనే అనుమానాలు కలుగుతున్నాయి.