Costly Mangoes: ఈ మామిడి పండు ధర కిలో రూ. 2.75 లక్షలు.. ఇంత రేటు ఎందుకో తెలుసా..?

నార్మల్‌ మామిడిపళ్లతో పోలిస్తే ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కో పండు 400 నుంచి 900 గ్రాములు ఉంటుంది. అంటే దాదాపు కిలో అన్నమాట. మిగిలిన మామిడిపళ్లలో కంటే ఈ మియాజాకి మామిడిపళ్లలో 15 శాతం షుగర్‌ ఎక్కువగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - June 11, 2023 / 10:58 AM IST

సమ్మర్‌ వచ్చిందంటే ప్రతీ ఒక్కరూ మామిడి పండ్లు తినాల్సిందే. సమ్మర్‌లో మాత్రమే దొరికే ఈ మామిడి.. అన్ని ఫ్రూట్స్‌కి రారాజు. మామిడిపళ్లు అంటే ఇష్టపడనివాళ్లు ఎవరూ ఉండరు. ఎంత టేస్టీగా ఉన్నా.. ఎంత ఫ్రెష్‌గా ఉన్నా.. మామిడిపళ్ల ధర ఎంత ఉంటుంది? క్వాలిటీని బట్టి 100 నుంచి 400 వరకూ ఉంటుంది. కానీ మీరు చూస్తున్న ఈ మామిడి ధర మాత్రం కిలో ఏకంగా 2 లక్షల 75 వేలు. ఇవేవో ఫారిన్‌ నుండి ఇంపోర్ట్‌ చేసుకున్న మామిడిపళ్లు కాదు. ఇండియాలో దొరికేవే.

వెస్ట్‌బెంగాల్‌లో ప్రతీ ఏటా సమ్మర్‌లో మామిడిపళ్ల ఎగ్జిషన్‌ నిర్వహిస్తుంటారు. ఈసారి ఈ ఎగ్జిబిషన్‌లో 262 రకాల మామిడిపళ్లను ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలో మియాజాకి అనే రకానికి చెందిన ఈ మామిడిపళ్లను కూడా ప్రదర్శించారు. నిజానికి ఇవి మొదట్లో జపాన్‌లో మాత్రమే దొరికేవి. కానీ ఆ తరువాత ఇండియాలో పాటు కొన్ని ఏషినయ్‌ దేశాల్లో దీన్ని పండిస్తున్నారు. నార్మల్‌ మామిడిపళ్లతో పోలిస్తే ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కో పండు 400 నుంచి 900 గ్రాములు ఉంటుంది. అంటే దాదాపు కిలో అన్నమాట. మిగిలిన మామిడిపళ్లలో కంటే ఈ మియాజాకి మామిడిపళ్లలో 15 శాతం షుగర్‌ ఎక్కువగా ఉంటుంది. పోషకాలు కూడా అదే లెవెల్‌లో ఉంటాయి. చాలా రేర్‌గా లభించే మామిడి కావడంతోనే ఈ పండుకు ఇంత ధర.

ఈ పంటకు రైతులు చాలా ప్రయార్టీ ఇస్తుంటారు. ఈ పంటకు కాపలాగా ఉండేందుకు సపరేట్‌గా వేట కుక్కలను కూడా పెంచుతుంటారు. కాయ గొందలించాలని చూస్తే అంతే సంగతి. ఎందుకంటే కిలో లక్షల్లో పులకుతోంది మరీ. ప్రదర్శనలో ఈ మిజాయాకి గురించి తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ నోళ్లువెల్లబెడుతున్నారు. ఇంత కాస్లీ మామిడిపళ్లు కూడా ఉంటాయా అంటూ షాకవుతున్నారు.