నేటి జనరేషన్ మోత్తం స్మార్ట్ ఫోన్లలోనే గడిపేస్తుంటారు. ముఖ్యంగా ఇన్ స్టా, యూట్యూబ్ రీల్స్ అంటూ తెగ సందడి చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికోసం యూట్యూబ్ అద్బుతమైన ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. ఎన్నో రకాల వీడియోలు ఉండే మహా సముద్రమే యూట్యూబ్. నిత్యం తన వీడియోలతో కోట్ల మందికి వినోదాన్ని అందిస్తుంది. దీనిని ఉపయోగిస్తున్న యూజర్లకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ సరికొత్త ఫీచర్ ను తీసుకురానుంది. అదే సాంగ్ సర్చ్.
అసలు ఏంటి ఈ సాంగ్ సర్చ్
ప్రతి రోజూ యూట్యూబ్ ద్వారా మంచి మంచి పాటలను ఎంచుకొని సంగీతం వింటూ హాయిగా గడిపేసే వాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి పాటను సర్చ్ బార్ లో టైప్ చేసి, మైక్ దగ్గర పాట పాడనవసరం లేకుండా కేవలం హమ్ చేస్తే చాలు ఆ పాట ఏంటో ఇట్టే కనిపెట్టేయగల సాంకేతికతను దీనికి జోడిస్తున్నారు. ఈ సరి కొత్త ఫీచర్ ద్వారా యూజర్ తనకు ఇష్టమైన పాటను అతి సులభంగా వెతికేందుకు వీలుంటుండి. మామూలు యూట్యూబ్‌లోని వాయిస్ సెర్చ్ ద్వారానే ఈ సాంగ్ సెర్చ్‌ను కూడా యాక్సెస్ చేయొచ్చు. గూగుల్ లోని హమ్ టు సెర్చ్ అనే ఫీచర్ ఆధారంగానే దీనిని రూపొందించినట్లు తెలిపారు యూట్యూబ్ యాజమాన్యం. తమకు ఇష్టమైన పాట కావాలంటే జస్ట్ మూడు సెకన్ల పాటూ మైక్ సింబల్ ను టచ్ చేసి హమ్ చేస్తే చాలు. దానికి సంబంధించిన ఒరిజినల్ అండ్ క్రియేటెడ్ పాటలు మొత్తం మీ డివైజ్ స్క్రీన్ పై ప్రత్యక్షమౌతాయి.
గూగుల్ హమ్ టచ్ కి.. యూట్యూబ్ సాంగ్ సర్చ్ కి తేడా..
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అతి తక్కువ మందికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది యూట్యూబ్. రానున్న రోజుల్లో యూట్యూబ్ వినియోగిస్తున్న యూజర్లందరూ దీనిని వాడుకునేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. అలాగే ప్రస్తుతం సాంకేతికంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నామని ప్రకటించింది. దీంతో యూట్యూబ్ ఇంటర్ ఫేజ్ కూడా మారిపోతుందని తెలిపింది. గతంలో గూగుల్ హమ్ టచ్ లో ఈ ఫీచర్ ఉంది కదా అని అనుకునే వాళ్లకి దానికి దీనికి ఉన్న వ్యత్యాసాన్ని కూడా చెప్పేసింది. గూగుల్ హమ్ టచ్ లో 15 సెకన్ల పాటూ హమ్ చేయాలి. అదే సరికొత్త యూట్యూబ్ లో అయితే కేవలం మూడు సెకన్లు హమ్ చేస్తే చాలు కోరుకున్న పాటను వినచ్చు.
T.V.SRIKAR