Zomato Shares down:  జొమాటోకు భారీ షాక్ ! భారీగా పడిపోతున్న షేర్లు !!

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు ఊహించని షాక్ తగిలింది. 400 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని DGGI నోటీసులు ఇచ్చింది.  దాంతో స్టాక్ మార్కెట్లో జొమాటో షేర్లు పడిపోతున్నాయి. .

  • Written By:
  • Publish Date - December 28, 2023 / 12:53 PM IST

ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమోటో వినియోగదారుల నుంచి డెలివరీ ఫీజులు వసూలు చేస్తోంది. కానీ దీనికి జీఎస్టీ చెల్లించడం లేదు.  దాంతో రూ.401.7 కోట్ల రూపాయల GST బకాయిలు చెల్లించాలంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) డిమాండ్ నోటీసులు పంపించింది. డెలివరీ అనేది సర్వీస్ కిందకు వస్తున్నందున…. 18 శాతం GST కట్టాలని డీజీజీఐ కోరింది. దాంతో జొమాటో షేర్లు 4 శాతానికి పైగా పడిపోయాయి.

జీఎస్టీ బకాయిలతో పాటు డెలివరీ భాగస్వాముల తరపున కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై పన్నులను 2019 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ జొమాటో చెల్లించాలి.  ట్యాక్సుతో పాటు జరిమానా, వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంది.  DGGI నోటీసులపై స్పందించిన జొమాటో… తాము ఎలాంటి పన్ను బకాయిలు లేవని చెబుతోంది. డెలివరీ భాగస్వాముల తరఫున ఛార్జీలు వసూలు చేశాం. కస్టమర్లకు తాము డైరెక్ట్ గా డెలివరీ సేవలు అందించలేదని వాదిస్తోంది. పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్న రూల్స్ ప్రకారం డెలివరీ భాగస్వాములే ఆ సేవలను అందిస్తున్నారని జొమాటో ప్రతినిధులు చెబుతున్నారు.

జొమాటోలో కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు బిల్లులో మూడు అంశాలు ఉంటాయి. అందులో ఒకటి ఆహార పదార్థాల ధర, రెండోది ఫుడ్ డెలివరీ ఛార్జీ.. ఒకవేళ ఎవరైనా సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి ఈ ఛార్జీలు వసూలు చేయరు. మూడోది ఆహారం ధర, ప్లాట్ ఫామ్ ఫీజుపై ఐదు శాతం ట్యాక్స్ గురించి ఉంటుంది. ఈ ట్యాక్స్ ను జీఎస్టీ మండలి 2022 జనవరి నుంచి అమలులోకి తీసుకొచ్చింది.

స్విగ్గీ కూడా జీఎస్టీ కట్టాల్సిందే!

జొమాటోకు రూ.401.7 కోట్లు కట్టాలని నోటీసులు ఇచ్చిన GST అధికారులు… స్వీగ్గీకి కూడా రూ. 350 కోట్ల బకాయిలు చెల్లించాలని కోరారు. డెలివరీ ఛార్జ్ అనేది ఇంటింటికీ ఆహారాన్ని డెలివరీ చేయడానికి వెళ్ళే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చే అని స్వీగ్గీ, జొమాటో వాదిస్తున్నాయి. జీఎస్టీ నోటీసుల తర్వాత ఫుడ్ ఆర్డర్‌ల ఛార్జీలను 2 నుంచి 3 రూపాయలకి పెంచాలని స్విగ్గీ, జొమాటో ఆన్ లైన్ ఫుడ్ డెలీవరి సంస్థలు నిర్ణయించాయి.