Zombie Virus: ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రాచీన వైరస్..?

గత కొన్నేళ్ల క్రితం తెలుగులో జాంబి రెడ్డి పేరుతో ఒక సినిమా విడుదలైంది. ఈ చిత్రం ఒక సైన్స్ ఫిక్షన్ హర్రర్ గా తెరకెక్కింది. ఇందులో మనుషులకు ఒక వైరస్ సోకి అందవికారంగా మారుతారు. అలాంటి ప్రమాదకరమైన వ్యాధులను ప్రభలించేవి నిజంగానే సమాజంలో ఉన్నాయా అంటే అప్పట్లో అంత అవగాహన ఉండేది కాదు. కానీ తాజాగా రష్యాలోని సైబీరియా ప్రాంతంలో మంచు శిఖరాల నుంచి ఈ వైరస్ నమూనాలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇవి నిజంగానే ప్రమాదకరమా.. దీని ప్రభావం ఏవిధంగా మనుషులపై పడుతుంది. ఎన్నేళ్ల క్రితం నుంచి భూమిపై ఉన్నాయి అనే ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

  • Written By:
  • Publish Date - March 11, 2023 / 03:58 PM IST

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తో కోట్లాది మంది మృత్యువాత పడ్డారు. కొన్ని నెలల నుంచే లేలేత అరుణోదయ సూర్యకిరణాల్లా ఈ మహమ్మారి ముంపు నుంచి బయటకు వస్తున్నారు. ఇంతలో ప్రాచీన వైరస్ గురించి ఓ పెద్ద వార్త ప్రపంచ మానవాళిని భయాందోళనలకు గురిచేస్తోంది. ఇది అలాంటి ఇలాంటి వైరస్ కాదంట. దీనిపేరు జాంబీ వైరస్. ఇది ఈ దశాబ్ద కాలంలో పుట్టుకొచ్చింది అస్సలు కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే ఉంది. సుమారు 48,500 సంవత్సరాల క్రితం రష్యాలోని నైజీరియా తోడేళ్ల సంచారంలో ఉండేది అని పరిశోధకులు అంచనా వేశారు. అక్కడి మంచు పర్వత శ్రేణుల్లో జంతువుల మృత కళేబరాల్లో గుర్తించబడింది.

  • తోడేళ్ళ ప్రేగుల నుంచి వ్యాప్తి:

వాస్తవానికి రష్యా దేశం లో పూర్తిగా మాంచుతో గడ్డకట్టి ఉన్నా యూకేచి అలాస్ సరసు లో కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించి ఉన్న తోడేళ్ళ అవశేషాల్లో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ వైరస్ తోడేళ్ళ జీర్ణాశయపు ప్రేగుల్లో ఉంటుంది అని ఫ్రెంచ్ పరిశోధకులు వెల్లడించారు. ఈ వైరస్ వ్యాప్తి కరోనా మాదిరి తుమ్ము , దగ్గుల ద్వారా సంక్రమణం చెందేది కాదు. అని ఒక వ్యక్తి శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశిస్తే ఆ క్షణం నుంచి ఆ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి మరో వ్యక్తిని విచక్షణారహితంగా కృరా మృగల వలే కరవటం వంటి చేష్టలు చేస్తారు. అలా జాంబీ దాడికి గురైన వారందరూ జాంబీలుగా మారుతారు అని బయాలజీ పరిశోధకులు చెబుతున్నారు.

  • ఈ వైరస్ ఎలా బయటపడింది.?

చాలా కాలంగా వచ్చే వాతావరణ మార్పు మానవ జీవితాలను ముప్పుగా మారుస్తూ వస్తోంది. అలా వాతావరణ పరిస్థితుల నుంచి వెలుగులోనికి వచ్చిందే ఈ ప్రమాదకర వైరస్. అదే Zombie 🦠 Virus. ఇది సైబీరియాలో మంచు పర్వతం కరిగిపోవడం ద్వారా పెను ప్రమాదాన్నికి దారితీస్తుందని చెప్పాలి. ఆ కరిగిన మంచు గడ్డల్లో ఉన్న తోడేళ్ల అవశేషాల్లో ఈ వైరస్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జాంబీ వైరస్‌లు ప్రజలలో ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతాయని, ఇంతవరకు ఈ వైరస్ మనుషులకు సోకినట్లు ప్రపంచవ్యాప్తంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ముందు జాగ్రత్తగా ఇది మానవులకు రాబోయే రోజుల్లో పెను ముప్పుగా పరిణమించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్నటువంటి సమయంలో దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని భవిష్యత్తులో ఈ వైరస్ తో ప్రజారోగ్యం దెబ్బతినే అవకాశం ఉండబోతుంది అని స్పష్టం చేశారు .

  • బ్యాక్టీరియా – వైరస్ ల జన్యు కలయికగా గుర్తింపు:

మొట్టమొదటిసారి 1996లో ఓ పొలంలో ఉన్న పశువుల్లో బయటపడింది. ఆ తర్వాత క్రమంగా ఇతర పశువులకు వ్యాప్తి చెందుతూ వచ్చింది. ఇలా జాంబీ వైరస్ బారిన పడిన ఒక్క జంతువు అన్ని పశువులనూ చంపేసేవి. అప్పట్లో ఒక ప్రాంతానికే పరిమితం చేసి ఈ వ్యాధి అన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేశారు. అనంతరం వాటి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. బాక్టీరియాతో పాటూ ఇతర వైరస్‌ల జన్యు సమాచారం లభించింది. ఇక చాలా ఏళ్ళ తర్వాత ఇదే ఏడాది 2022 ఏప్రిల్ 6 నా కెనడాలో అటవీ జింకల్లో జాంబి వైరస్ (Zombie Virus) బయటపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయని కొందరు చెబుతున్నారు.

  • జింకల నుంచి వచ్చినట్లు ఆధారాలు:

VICE వరల్డ్ న్యూస్ వార్తల ప్రకారం.. కెనడాలోని పలు జింకల జాతుల్లో జాంబి వైరస్ సంక్రమణ వేగంగా వ్యాపిస్తోందని తెలిసింది. దీని బారిన పడిన జింకలు ఇతర జింకలను చంపి తింటున్నాయట. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దీనిని అంటు వ్యాధిగా ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. జింకలలో అత్యంత వేగంగా ఈ మహమ్మారి వ్యాపిస్తోందని ఆల్బెర్టా విశ్వవిద్యాలయానికి చెందిన వన్యప్రాణి వ్యాధి నిపుణులు తెలిపారు.

  • వాస్తవానికి వినోదం జోడించి:

ఈ జాంబి వైరస్ అనే కాన్సెప్ట్ పైన చాలా సినిమాలే వచ్చాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది 2016 లో విడుదలైన (South Korean movie Train to Busan) లో ఈ వైరస్ వ్యాప్తి గురించి అద్భుతంగా చూపించారు . మొదట ఈ జాంబి వైరస్ జింకలో ఉన్నట్లు చూపించి అక్కడ నుంచి ఒక మనిషికి వ్యాప్తి చెందినట్లుగా చిత్రీకరించారు. అలా ఒకరికి సోకిన ఈవైరస్ పూర్తిగా ఆ దేశంలో అందరికీ సంక్రమించి ఏఒక్కరి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యింది. చివరికి ముగ్గురు ఆర్మీకి చెందిన వ్యక్తులు బ్రతికున్నట్లు చూపిస్తారు. ఇదే మాదిరి తెలుగులోనూ జాంబి రెడ్డి పేరిట ఓ సినిమా విడుదల అయింది. ఇందులోనూ వైరస్ సోకిన వ్యక్తి ఇంకొక వ్యక్తిని కరవడంతో సంక్రమిస్తుందని స్పష్టంగా చూపించారు.

  • పర్యావరణ కాలుష్యం – కొత్త వైరస్ కు ప్రాణం:

ఇంతటి ప్రాణాంతకమైన వ్యాధులు, వైరస్ లు పునర్జీవం పొందడానికి కారణం ముమ్మాటికీ మానవుల తప్పిదమే అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి నూతన చట్టాలను తెస్తున్నారు. వాటిని పాటించకుండా తమ స్వార్థప్రయోజనాల కోసం విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదటి కారణం. అలాగే ఫ్యాక్టరీలను నెలకొల్పి భారీ స్థాయిలో నైట్రోజన్, మీథేన్, సల్ఫర్ డయాక్సైడ్, కర్భన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు బయటకు వెలువరింపజేయడం కూడా మరో కారణం. ఇలా బయటకు వచ్చి వాయుకాలుష్యాలు జరగడం ద్వారా ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడుతుంది. ఈ పోరకు రంధ్రాలు ఏర్పడి సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా నేలపై పడుతుంది. ఆకిరణాల వేడికి భూమి వేడెక్కి అంటార్కిటికా మంచు ఖండంలో గడ్డగటినా హిమపర్వతాలు కరగటం ప్రారంభమయ్యాయి. అలా కరిగిన పర్వతాల లోపల పురాతన జంతువుల అవశేషాలో ఉన్న బ్యాక్టీరియా , వైరస్ లు నిద్రావస్థలో ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఇవి కల్చర్డ్‌ అమీబా కణాలకు వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. అమీబా సంక్రమణ చెందిన వైరస్‌లు చాలా సంవత్సరాల పాటూ వృద్ది చెందనప్పటికీ అంటువ్యాధులను కలుగజేసే సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉందని అభిప్రాయ పడ్డారు. ఇలా జరిగినప్పుడు మిగతా వైరస్‌లు త్వరగా ఉత్పత్తి చెందేందుకు కారణమవుతున్నట్లు క్లావెరీ తెలిపారు. రోజురోజుకూ ఈ వైరస్ వృద్ది రేటు భారీగా పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.

ఇలాంటి ప్రాణాంతకమైన వైరస్ లను త్వరగా గుర్తించి సరైన టీకాలను తయారు చేయడం మంచిది. వ్యాధి బారినపడి వ్యాక్సిన్ తీసుకోవడం కంటే వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టడం ఉత్తమం. ఇలా చేస్తే మరో ప్రాణాంతకమైన పరిస్థితులకు వెళ్లకుండా ఇప్పుడే ఊపిరిపీల్చుకోవచ్చు.

 

 

S.SURESH