India vs England : ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్… వికెట్ల వేట మొదలుపెట్టిన భారత బౌలర్లు

విశాఖ (Visakhapatnam) వేదికగా జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు భారత్ ఆధిపత్యం కొనసాగింది. గిల్ సూపర్ సెంచరీతో ఇంగ్లిష్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. యంగ్ స్టార్ బ్యాటర్ శుభ్‍మన్ గిల్ కీలకమైన సమయంలో శతకంతో అదరగొట్టాడు.

విశాఖ (Visakhapatnam) వేదికగా జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు భారత్ ఆధిపత్యం కొనసాగింది. గిల్ సూపర్ సెంచరీతో ఇంగ్లిష్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. యంగ్ స్టార్ బ్యాటర్ శుభ్‍మన్ గిల్ కీలకమైన సమయంలో శతకంతో అదరగొట్టాడు. అక్షర్ పటేల్ (45) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మిగిలిన భారత బ్యాటర్లు రాణించలేకపోయారు.

ఒక దశలో వికెట్లు కోల్పోయిన టీమిండియా (Team India) కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో భారత శుభ్‍మన్ గిల్(Shubman Gill), అక్షర్ పటేల్ ఆదుకున్నారు. శుభ్‍మన్ గిల్ 132 బంతుల్లోనే శతకాన్ని చేరి అదరగొట్టాడు. టెస్టు క్రికెట్‍లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో వికెట్‍కు గిల్, అక్షర్ 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఔట్ అయ్యాక మిగిలిన వారంతా త్వరగానే వెనుదిరిగారు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ విలువైన పరుగులు చేశాడు.

399 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ (England) మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ను అశ్విన్ ఔట్ చేశాడు. జాక్ క్రాలీ , రెహాన్ అహ్మద్ క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలువాలంటే ఇంగ్లండ్‍కు ఇంకా 332 పరుగులు అవసరం. భారత్ గెలువాలంటే 9 వికెట్లు పడగొట్టాలి. ఐదు టెస్టుల సిరీస్‍లో తొలి మ్యాచ్ ఓడిన టీమిండియాకు రెండో టెస్టు గెలవడం చాలా కీలకం.