Abhishek Sharma : ఓపెనర్ గా అభిషేక్ శర్మ.. సన్ రైజర్స్ ప్లేయర్ కు గోల్డెన్ ఛాన్స్

భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతోంది. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎంతోమంది యువ క్రికెటర్లు ఐపీఎల్ ప్రదర్శనతో టీమిండియాకు ఎంపికయ్యారు.

భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతోంది. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎంతోమంది యువ క్రికెటర్లు ఐపీఎల్ ప్రదర్శనతో టీమిండియాకు ఎంపికయ్యారు. తాజాగా 17వ ఐపీఎల్ సీజన్ లో సత్తా చాటిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ జింబాబ్వే సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేయనున్నాడు. తొలి టీ ట్వంటీలో గిల్ తో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ శుభమన్ గిల్ స్వయంగా వెల్లడించాడు. రుతురాజ్ గైక్వాడ్ మూడో స్థానంలో రానున్నాడు.

ఇప్పుడు ఓపెనింగ్ చేయబోతున్న అభిషేక్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున చెలరేగిపోయాడు. అతడు 16 మ్యాచ్ లలో ఏకంగా 204.22 స్ట్రైక్ రేట్ తో 484 రన్స్ చేశాడు. అతనితోపాటు రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ లాంటి వాళ్లు కూడా టీ20ల్లో భారత్ తరఫున అరంగేట్రం చేయనున్నారు. పరాగ్ కూడా ఈ ఏడాది ఐపీఎల్ లో 15 మ్యాచ్ లలో 149 స్ట్రైక్ రేట్ తో 573 రన్స్ చేశాడు. ఇదిలా ఉంటే టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉన్న కే దూబె, జైస్వాల్, సంజూ ఇంకా జింబాబ్వే వెళ్లలేదు. దీంతో తొలి రెండు టీ20లకు వీళ్లు అందుబాటులో ఉండరు. వీళ్ల స్థానంలో జితేష్ శర్మ, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్ లను సెలక్టర్లు ఎంపిక చేశారు. జింబాబ్వే పర్యటనలో భారత యువ జట్టు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది.