న్యూజిలాండ్ తో చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ ఆడి అదరగొట్టేద్దాం అనుకున్న ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఆశలకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. గ్రేటర్ నోయిడా వేదికగా జరగాల్సిన ఈ టెస్ట్ వర్షం కారణంగా తొలి రెండురోజుల ఆట రద్దయింది. గ్రౌండ్ సిద్ధం కాకపోవడంపై ఆప్గనిస్తాన్ క్రికెట్ టీమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ మ్యాచ్ కోసం చేసిన ఏర్పాట్లపైనా అసహనం వ్యక్తం చేశారు. స్టేడియంలో సౌకర్యాలు కూడా సరిగ్గా లేవని అఫ్గానిస్థాన్ ఆరోపిస్తోంది. తాగునీరు, విద్యుత్ సరాఫరా సక్రమంగా లేదని, , మహిళలకు వాష్‌రూమ్స్ లేవని అఫ్గాన్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ స్టేడియానికి మరోసారి వచ్చేది లేదని వ్యాఖ్యానించారు. కాగా కొన్నేళ్ళుగా ఆఫ్గన్ టీమ్ కు బీసీసీఐ అండగా నిలుస్తోంది.