శ్రీలంకతో (Sri Lanka) టీ20 (T20) సిరీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇక వన్డే సిరీస్ పై దృష్టి పెట్టనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ ఇవాళ కొలంబో వేదికగా జరగనుంది. ఇటీవలే అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్థార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వన్డే జట్టులో చేరారు. వీరితో పాటు వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో స్థానం కోల్పోయిన అయ్యర్ తిరిగి వచ్చాడు. టీ20 వరల్డ్ కప్ (T20 world cup) తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో అందరి చూపు వీరిపైనే ఉంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ సిరీస్ నుంచే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ సన్నాహాలు షురూ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ లో రియాన్ పరాగ్ (Ryan Parag), హర్షిత్ రాణా అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు శ్రీలంక కొత్త కెప్టెన్చరిత అసలంక కెప్టెన్సీలో బరిలోకి దిగుతుంది. కీలక ఫాస్ట్ బౌలర్లు దూరం కావడం ఆ జట్టుకు ఎదురు దెబ్బగానే చెప్పాలి. టీ ట్వంటీ సిరీస్ (T20 Series) లో ఓడిపోయిన శ్రీలంక వన్డే సిరీస్ లో ఆ జట్టు ఎంత వరకూ పోటీ ఇస్తుందో చూడాలి.