Sara Tendulkar: డీప్ ఫేక్ టెక్నాలజీ బారిన పడ్డ మరో సెలబ్రిటీ జంట.. మార్ఫింగ్‌ ఫొటో వైరల్‌..

ఈ జెనరేషన్‌ బ్యాంటింగ్‌ సెన్సేషన్‌ శుభ్‌మన్ గిల్, సచిన్‌ కూతురు సారా టెడూల్కర్‌ మార్ఫింగ్‌ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను చుట్టేస్తున్నాయి. గిల్‌, సారా క్లోజ్‌గా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

  • Written By:
  • Publish Date - November 7, 2023 / 05:34 PM IST

Sara Tendulkar: ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (AI) రోజు రోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. ఏఐని ఉపయోగించి తయారు చేస్తున్న మార్ఫింగ్‌ ఫొటోలు వీడియోలు ఒకరకంగా భయాన్ని క్రియేట్‌ చేస్తున్నాయి. చూసేందుకు అచ్చు ఒరిజినల్‌లాగే ఉంటున్నాయి. ఎంతో నైపుణ్యం ఉన్నవాళ్లు ఈ ఫొటోలు, వీడియోలను గుర్తుపట్టలేకపోతున్నారు. వీటివల్ల చాలా జీవితాలు రోడ్డునపడే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి చాలా ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.

Rashmika Mandanna: శ్రీవల్లి రియాక్షన్.. డీప్‌ ఫేక్‌ వీడియోపై రష్మిక ఎమోషనల్ పోస్ట్..

ఇదే క్రమంలో మరో సెలబ్రిటీ జంట ఫొటో కూడా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ జెనరేషన్‌ బ్యాంటింగ్‌ సెన్సేషన్‌ శుభ్‌మన్ గిల్‌ (Shubhman Gill), సచిన్‌ కూతురు సారా టెడూల్కర్‌ (Sara Tendulkar) మార్ఫింగ్‌ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను చుట్టేస్తున్నాయి. గిల్‌, సారా క్లోజ్‌గా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. వాళ్లిద్దరి రిలేషన్‌షిప్‌ను కన్ఫాం చేస్తూ సారా టెండూల్కర్‌ ఈ పోస్ట్‌ పెట్టిందని అంతా కామెంట్‌ చేస్తున్నారు. కానీ, నిజానికి ఇది ఫేక్‌ పోస్ట్‌. ఇది ఓ మార్ఫింగ్‌ ఫొటో. ఒరిజినల్‌ ఫొటోలో సారా టెండూల్కర్‌ తన బ్రదర్‌ అర్జున్‌ టెండూల్కర్‌తో ఉంది. కానీ అర్జున్‌ ముఖాన్ని గిల్‌ ఫేస్‌తో మార్ఫ్‌ చేసి ఈ ఫొటోను తయారు చేశారు. కానీ, చూసేందుకు గిల్‌తో నిజంగానే సారా ఫొటో దిగినట్టు కనిపిస్తోంది.

Guntur Kaaram: ప్రోమోనే బాగుంది ! గుంటూరు కారం సాంగ్‌ రివ్యూ..

దీంతో ఏఐ ఇంత డేంజరా అని షాకవుతున్నారు నెటిజన్లు. రీసెంట్‌గా రష్మిక మందనా వీడియో అంటూ ఇంటర్నెట్‌లో ఓ వీడియో రిలీజైంది. ఆ వీడియో కూడా ఇలా ఏఐ ఉపయోగించి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా హాట్‌ టాపిక్‌గా ఉంది. ఇవన్నీ చూస్తుంటే.. టెక్నాలజీ పెరిగిందని సంతోషించాలా.. లేక ప్రమాదంలో పడుతున్నామని బాధ పడాలో అర్థం కావడంలేదంటున్నారు పబ్లిక్‌.