Agarkar: అర్జెంటుగా విండీస్ ప్రయాణం అగార్కర్ కోసం రోహిత్ వెయిటింగ్

వెస్టిండీస్‌ పర్యటనను భారత్ ఘనంగా ఆరంభించిన విషయం తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో రోహిత్ సేన భారీ విజయం సాధించింది.

  • Written By:
  • Publish Date - July 17, 2023 / 04:21 PM IST

దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు యశస్వీ జైశ్వాల్‌ , కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగగా.. సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌ 12 వికెట్లతో సత్తాచాటాడు. ఇక జూలై 20 నుంచి ట్రినిడాడ్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టుకు ముంచు బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ వెస్టిండీస్‌కు వెళ్లనున్నాడు. నేరుగా ట్రినిడాడ్‌కు చేరుకుని భారత జట్టును కలవనున్నాడు. అగార్కర్ ఛీప్‌ సెలక్టర్‌గా ఎంపికైన తర్వాత భారత జట్టును, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను కలవలేదు. ఛీప్‌ సెలక్టర్‌గా అగార్కర్ ఎంపిక కాకముందే భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లింది.

దాంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ద్రవిడ్‌ను కలిసేందుకు అగార్కర్ వెళ్లాడట. మరోవైపు ఐర్లాండ్‌ టూర్‌కు భారత జట్టు ఎంపిక గురించి రోహిత్‌ శర్మ, రాహుల్ ద్రవిడ్‌తో అజిత్ అగార్కర్ చర్చించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. విండీస్‌ పర్యటన ముగిసిన అనంతరం భారత్ ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా భారత్, ఐర్లాండ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. ఈ పర్యటనకు భారత ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపే అవకాశం ఉంది. ప్రపంచకప్ 2023 నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.