Daniel Vettori: వెల్ కమ్ వెటోరి

ఈ ఏడాది మే లో ముగిసిన ఐపీఎల్ - 16లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాన నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చే సీజన్ నుంచి కొత్త హెడ్‌కోచ్ రాబోతున్నాడు.

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 06:23 PM IST

ఈ ఏడాది మే లో ముగిసిన ఐపీఎల్ – 16లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాన నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చే సీజన్ నుంచి కొత్త హెడ్‌కోచ్ రాబోతున్నాడు. 2023 సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీకి హెడ్‌కోచ్‌గా వ్యవహరించిన విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాకు ఉద్వాసన పలికిన ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం.. కివీస్ మాజీ ఆల్ రౌండర్ డానియల్ వెటోరీని హెడ్‌కోచ్‌గా నియమించింది. ఈ మేరకు సోమవారం ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

గత సీజన్‌లో అత్యంత నిరాశజనకమైన ఆటతీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న సన్ రైజర్స్.. లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్‌ను కోచ్‌గా నియమించనుందని వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆండీ ఫ్లవర్‌ ఆర్సీబీకి కోచ్‌గా వ్యవహరించేందుకు అంగీకారం తెలిపాడు. దీంతో ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్.. వెటోరీ వైపునకు మొగ్గుచూపింది. వెటోరీ గతంలో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడటమే గాక అదే జట్టుకు 2014 నుంచి 2018 వరకూ కోచ్‌గా సేవలందించాడు. విండీస్ దిగ్గజం లారాను 2023లో హెడ్ కోచ్ గా తీసుకొచ్చినా, సన్ రైజర్స్‌ విజయాల బాట పట్టలేదు. జట్టులో స్టార్ బ్యాటర్లు, హిట్టర్లు, మంచి బౌలింగ్ దళం ఉన్నప్పటికీ వరుసగా మూడు సీజన్లుగా సన్ రైజర్స్ దారుణ ఓటములను మూటగట్టుకుంటున్నది. ఇక వెటోరీ రాకతో, సన్ రైజర్స్ స్క్రీన్ ప్లే వీరలెవెల్ లో ఉండబోతుంది అంటూ, ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఖుషి అవుతున్నారు.