Hanuma Vihari: నువ్వేమి చేసావు నేరం నినెక్కడంటింది పాపం

టీమిండియా నుంచి నన్నెందుకు తప్పించారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని క్రికెటర్ హనుమ విహారి అన్నారు. టీమిండియాలో స్థానం లేనందుకు ఎంత నిరాశ చెందానో.. జట్టు నుంచి ఎందుకు తొలగించారు అనే కారణం తెలియక అంతకంటే ఎక్కువగానే బాధపడుతున్నానని అతడు చెప్పాడు.

  • Written By:
  • Publish Date - July 12, 2023 / 05:36 PM IST

ఈ విషయం గురించి మేనేజ్‌మెంట్‌ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు అతని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి కెరీర్‌లో లోటుపాట్లు సహజం.. అయితే, ఇలాంటి చేదు అనుభవాలను జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది అని హనుమ విహారి అన్నారు. మొదట్లో చాలా బాధపడేవాడిని.. కానీ ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి.. భారత జట్టులో నాకు చోటుందా లేదా అన్న విషయం గురించి ఎక్కువగా ఆందోళన పడటం లేదు.. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ట్రోఫీలు గెలిచే దిశగా ముందుకు సాగడమే నా తక్షణ కర్తవ్యం అని ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి అన్నాడు.

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో అవకాశం వస్తుందని ఎదురుచూసిన హనుమ విహారికి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనుమ విహారీ మాట్లాడుతూ ఈ మేరకు కామెంట్స్ చేశాడు. ఇదిలా ఉంటే.. దులిప్‌ ట్రోఫీ-2023లో సౌత్‌ జోన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విహారి జట్టును విజేతగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెస్ట్‌ జోన్‌తో ఆరంభమైన ఫైనల్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిపోయాడు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 టెస్టులాడిన విహారి 839 పరుగులు చేశాడు.. అతని అత్యధిక స్కోరు 111 పరుగులుగా ఉంది.