Virat Kohli : మరో రికార్డు ముంగిట కోహ్లీ.. 6 రన్స్ చేస్తే సరికొత్త చరిత్ర

వరల్డ్ క్రికెట్ (World Cricket) లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ విరాట్ కోహ్లీ (Virat Kohli) .. క్రికెట్ గాడ్ సచిన్ (Cricket God Sachin) రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా టీ ట్వంటీ (T20 Cricket) క్రికెట్ లో కోహ్లీ మరో అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. కోహ్లి ఆరు పరుగులు సాధిస్తే.. టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.

 

వరల్డ్ క్రికెట్ (World Cricket) లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ విరాట్ కోహ్లీ (Virat Kohli) .. క్రికెట్ గాడ్ సచిన్ (Cricket God Sachin) రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా టీ ట్వంటీ (T20 Cricket) క్రికెట్ లో కోహ్లీ మరో అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. కోహ్లి ఆరు పరుగులు సాధిస్తే.. టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ , షోయబ్‌ మాలిక్‌, కీరన్‌ పొలార్డ్‌ తర్వాతి స్థానాల్లో నిలుస్తాడు.

దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలోనూ , ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సహా టీమిండియాకు ఆడుతూ.. అన్నీ కలిపి పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకూ 11 వేలకు పైగా పరుగులు సాధించాడు. అంతర్జాతీయ స్ టీ20లలో 4037 పరుగులు సాధించిన విరాట్‌ కోహ్లి అత్యధిక రన్స్‌ జాబితాలో నంబర్‌ వన్‌
బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అదే విధంగా.. ఐపీఎల్‌లోనూ 7263 రన్స్‌తో హయ్యస్ట్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు.

2022 టీ20 ప్రపంచకప్‌ తర్వాత దాదాపు పద్నాలుగు నెలల విరామం అనంతరం కోహ్లి అంతర్జాతీయ టీ20లలో రీ ఎంట్రీ ఇచ్చాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఇండోర్‌లో రెండో టీ20 సందర్భంగా రంగంలోకి దిగిన విరాట్‌ కోహ్లి.. 16 బంతుల్లో 29 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇవాళ్టి నామమాత్రపు మూడో టీ20కి ఆతిథ్యం ఇస్తోన్న బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం కోహ్లికి ఐపీఎల్‌లో హోం గ్రౌండ్‌. విరాట్ బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు భారీగా రానుండడంతో స్టేడియం కిక్కిరిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.