చంటిగాడు లోకల్ ఇక్కడ.. హోంగ్రౌండ్ లో అశ్విన్ అదుర్స్

బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తడబడి నిలబడింది. తొలి సెషన్ లో మొదటి గంట బంగ్లా బౌలర్లు పై చేయి సాధించగా... జైశ్వాల్ , పంత్ ఆదుకున్నారు. రెండో సెషన్ లో వరుస వికెట్లు చేజార్చుకున్నప్పటకీ రవిచంద్రన్ అశ్విన్ కౌంటర్ ఎటాక్ తో బంగ్లాకు దిమ్మతిరిగింది.

  • Written By:
  • Publish Date - September 19, 2024 / 05:28 PM IST

బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తడబడి నిలబడింది. తొలి సెషన్ లో మొదటి గంట బంగ్లా బౌలర్లు పై చేయి సాధించగా… జైశ్వాల్ , పంత్ ఆదుకున్నారు. రెండో సెషన్ లో వరుస వికెట్లు చేజార్చుకున్నప్పటకీ రవిచంద్రన్ అశ్విన్ కౌంటర్ ఎటాక్ తో బంగ్లాకు దిమ్మతిరిగింది. సాధారణంగా బంతితో మ్యాజిక్ చేసే అశ్విన్ గత కొంతకాలంగా బ్యాట్ తోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇప్పుడు చెపాక్ స్టేడియం హోం గ్రౌండ్ కావడంతో రెచ్చిపోయాడు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు సాధించాడు. వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడుతూ శతక్కొట్టాడు. 108 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అశ్విన్ కు ఇది టెస్టుల్లో 6వ శతకం.. అలాగే హోం గ్రౌండ్ లో రెండో శతకం.

అసలు 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన తర్వాత కనీసం 200 స్కోరైనా దాటుతుందా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జడేజాతో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఏడో వికెట్ కు 195 పరుగుల పార్టనర్ షిప్ తో స్కోరును 300 దాటించాడు. అశ్విన్ నుంచి ఇలాంటి కౌంటర్ ఎటాక్ బంగ్లా బౌలర్లు ఊహించి ఉండరు.. ఎందుకంటే తొలి సెషన్ లో బంగ్లా పేసర్ల జోరు చూసి భారత్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. అలాంటిది చంటిగాడు లోకల్ ఇక్కడ అంటూ అశ్విన్ రెచ్చిపోయాడు. నా దగ్గరా మీ ఆటలు అన్న రీతిలో శతకం సాధించి భారీస్కోరును అందించాడు. మొత్తం మీద చెపాక్ స్టేడియంలో లోకల్ బాయ్ అశ్విన్ సెంచరీ ఫ్యాన్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చింది.