Ravichandran Ashwin : అరుదైన రికార్డుల ముంగిట అశ్విన్

టీమిండియా (Team India) వెటరన్ స్పిన్నర్ (spinner) రవిచంద్రన్ అశ్విన్‌ను (Ravichandran Ashwin) అరుదైన రికార్డ్స్ ఊరిస్తున్నాయి. ఇంగ్లండ్‌ (England) తో ప్రారంభమైన రెండో టెస్ట్‌లో అశ్విన్ నాలుగు వికెట్ల తీస్తే సుదీర్ఘ ఫార్మాట్‌లో 500 వికెట్ల మైలు రాయిని చేరుకుంటాడు. ఈ ఘనతను అందుకున్న తొమ్మిదో క్రికెటర్‌గా.. రెండో భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడు.

టీమిండియా (Team India) వెటరన్ స్పిన్నర్ (spinner) రవిచంద్రన్ అశ్విన్‌ను (Ravichandran Ashwin) అరుదైన రికార్డ్స్ ఊరిస్తున్నాయి. ఇంగ్లండ్‌ (England) తో ప్రారంభమైన రెండో టెస్ట్‌లో అశ్విన్ నాలుగు వికెట్ల తీస్తే సుదీర్ఘ ఫార్మాట్‌లో 500 వికెట్ల మైలు రాయిని చేరుకుంటాడు. ఈ ఘనతను అందుకున్న తొమ్మిదో క్రికెటర్‌గా.. రెండో భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 496 వికెట్లు ఉన్నాయి. 96 మ్యాచ్‌ల్లో అతను ఈ ఫీట్ సాధించాడు. 132 టెస్ట్‌ల్లో 619 వికెట్లతో అనిల్ కుంబ్లే టాప్‌లో ఉన్నాడు. ఈ ఒక్క రికార్డే కాకుండా ఇంగ్లండ్‌తో టెస్ట్‌ల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా కూడా అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంటాడు. ప్రస్తుతం అశ్విన్ ఇంగ్లండ్‌పై 20 టెస్ట్‌ల్లో 93 వికెట్లు తీసాడు. వైజాగ్ టెస్ట్‌లో అతను 3 వికెట్లు తీస్తే 21 టెస్ట్‌ల్లో 96 వికెట్లు తీసి చంద్రశేఖర్ రికార్డును అధిగమిస్తాడు.

ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీస్తే ఇంగ్లండ్‌పై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కుతాడు. అంతేకాకుండా ఇరు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా గుర్తింపు పొందుతాడు. అశ్విన్ కన్నా ముందు జేమ్స్ అండర్సన్ ఈ ఘనతను అందుకున్నాడు. వైజాగ్ టెస్ట్ లో అశ్విన్ 8 వికెట్లు పడగొడితే.. భారత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కుతాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే రికార్డును అధిగమిస్తాడు. ప్రస్తుతం అశ్విన్ సొంతగడ్డపై 56 టెస్ట్ మ్యాచ్లు ఆడి 343 వికెట్లు తీసాడు.