IND Vs PAK: భారత్-పాక్ మ్యాచ్ ఎంతో.. బంగ్లా-లంక మ్యాచ్ కూడా అంతే..

భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక.. ఇలా ఏ జట్టు బౌలర్లయినా 10 ఓవర్లు వేసే సామర్థ్యంతో ఉన్నారా..? అన్నది ఆసియా కప్‌లో తేలిపోతుంది. ఇప్పుడు బౌలర్లందరూ మ్యాచ్‌కు నాలుగు ఓవర్ల చొప్పున వేసేందుకు అలవాటు పడ్డారు.

  • Written By:
  • Publish Date - August 28, 2023 / 04:27 PM IST

IND Vs PAK: ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌‌కు ముందు 50 ఓవర్ల ఫార్మాట్‌కు తగ్గట్లుగా ఉప ఖండ బౌలర్ల సన్నద్ధతకు ఆసియా కప్‌ పరీక్షగా నిలవబోతుందని పాకిస్థాన్‌ దిగ్గజ బౌలర్‌ వసీం అక్రమ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక.. ఇలా ఏ జట్టు బౌలర్లయినా 10 ఓవర్లు వేసే సామర్థ్యంతో ఉన్నారా..? అన్నది ఆసియా కప్‌లో తేలిపోతుంది. ఇప్పుడు బౌలర్లందరూ మ్యాచ్‌కు నాలుగు ఓవర్ల చొప్పున వేసేందుకు అలవాటు పడ్డారు. ప్రపంచకప్‌ ముందు 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్‌ నిర్వహించాలనే ఆలోచన మంచిది.

ఇది సుదీర్ఘంగా సాగే టోర్నీ. ఒక్క మ్యాచ్‌ గెలవగానే సెమీస్‌ చేరే ఛాన్స్‌ ఉండదు. ఒక్కో మ్యాచ్‌ ఆడుతూ సాగాలి. ఈ సారి టీ20 కాదు.. వన్డే ఫార్మాట్‌. అందుకే విభిన్నమైన మానసిక దృక్పథం, ఫిట్‌నెస్‌ అవసరం’’ అని వసీం తెలిపాడు. నిరుడు భారత్‌, పాకిస్థాన్‌ ఫైనల్‌ ఆశించామని, లంక టైటిల్‌ పట్టేసిందని, అందుకే ఈ సారి ఏ జట్టునూ ఫేవరెట్‌గా చెప్పడం లేదని అతనన్నాడు. ‘‘ఇప్పుడు భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక ప్రమాదకరమే. తమదైన రోజున ఏ జట్టయినా గెలవగలదు. భారత్‌, పాక్‌ పోరుకు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఎంతోమంది ఆసక్తితో తిలకిస్తారు. కానీ లంక లేదా బంగ్లాను తక్కువ అంచనా వేయలేం’’ అని వసీం కీలక వ్యాఖ్యలు చేసాడు.