Asian Games 2023: ఫైనల్స్‌లో టీమిండియా.. వీళ్ళ బ్యాటింగ్ అరివీరభయంకరం..

ఫైనల్ చేరిన టీమిండియా.. పతకం ఖాయం చేసుకుంది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. టీమిండియా బౌలర్ల ధాటికి కేవలం 17.5 ఓవరల్లో 51 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో నిగార్‌ సుల్తానా 12 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 03:17 PM IST

Asian Games 2023: ఆసియా క్రీడలను భారత్‌ ఘనంగా ప్రారంభించింది. తొలిరోజే పతకాల వేట ఆరంభించింది. ఇప్పటివరకూ 4 పతకాలు సాధించగా.. మరో పతకాన్ని ఖాయం చేసుకుంది. అదేంటంటే ఆసియా క్రీడల్లో టీమిండియా ఫైనల్ చేరడం. సెప్టెంబర్ 24వ తేదీ ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌-1లో మహిళల క్రికెట్ టీమ్ 8వికెట్ల తేడాతో విజయం సాధించింది.

దీంతో ఫైనల్ చేరిన టీమిండియా.. పతకం ఖాయం చేసుకుంది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. టీమిండియా బౌలర్ల ధాటికి కేవలం 17.5 ఓవరల్లో 51 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో నిగార్‌ సుల్తానా 12 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్‌ 4 వికెట్లు సాధించింది. సటిటాస్ సాధు, గైక్వాడ్‌, వైద్యా తలా ఓ వికెట్‌ దక్కించుకున్నారు. ఆ తర్వాత 52 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 8.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

భారత బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్ 20 నాటౌట్‌ పరుగులు చేసింది. షెఫాలీ వర్మ 17 పరుగులతో రాణించింది. సెప్టెంబర్‌ 25న ఆసియాక్రీడల ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్లో టీమిండియా శ్రీలంక లేదా పాకిస్తాన్‌తో తలపడనుంది.