Mitchell Marsh: వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీని వరుస పరాజయాలతో ఆరంభించిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత వరుసగా 7 మ్యాచుల్లో నెగ్గి సెమీస్‌కు చేరుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. 307 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 44.4 ఓవర్లలో ఆస్ట్రేలియా ఛేదించింది. మిచెల్ మార్ష్ 132 బంతుల్లో 177 నాటౌట్‌గా నిలిచాడు. అందులో 17 ఫోర్లు, 9 సిక్సర్లు బాదుడుతో బంగ్లాదేశ్ బౌలర్లను చితక్కొట్టాడు.
Sanju Samson: జాతీయ జట్టుకు కానిస్టేబుల్ కొడుకు.. హ్యాపీ బర్త్ డే సంజు..
స్టీవ్ స్మిత్ 64 బంతుల్లో 63 నాటౌట్‌గా నిలిచాడు. డేవిడ్ వార్నర్ 61 బంతుల్లో 53 అర్ధ శతకాలతో రాణించారు. ఈ విజయంతో 14 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా లీగ్ టేబుల్లో నాలుగో స్థానంలో నిలిచింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా.. ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ విఫలం అయ్యాడు. అయితే డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వార్నర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం వార్నర్ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ఆకట్టుకున్నాడు.
అర్ధ సెంచరీ చేశాడు. ఇక మరో ఎండ్‌లో మిచెల్ మార్ష్ రెచ్చిపోయి ఆడాడు. అఫ్గాన్‌పై మ్యాక్స్‌వెల్ ఎలా చెలరేగాడో.. అదే విధంగా మార్ష్ కూడా ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. స్టీవ్ స్మిత్‌తో కలిసి అజేయమైన మూడో వికెట్‌కు 175 పరుగులు జోడించాడు. దాంతో మరో 32 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది.