IPL : ఐపీఎల్ ఓ అద్భుతం..

ఆస్ట్రేలియన్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ కు ఐపీఎల్ తో విడదీయరాని బంధం ఉంది. 2012 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన మ్యాక్సీ.. తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. పవర్ హిట్టింగ్ తో పాటు అప్పుడప్పుడు తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. 2021 లో మ్యాక్స్ వెల్ బెంగళూరు జట్టులో అడుగుపెట్టిన తర్వాత ఈ స్టార్ ఆటగాడి క్రేజ్ అమాంతం పెరిగింది.

ఆస్ట్రేలియన్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ కు ఐపీఎల్ తో విడదీయరాని బంధం ఉంది. 2012 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన మ్యాక్సీ.. తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. పవర్ హిట్టింగ్ తో పాటు అప్పుడప్పుడు తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. 2021 లో మ్యాక్స్ వెల్ బెంగళూరు జట్టులో అడుగుపెట్టిన తర్వాత ఈ స్టార్ ఆటగాడి క్రేజ్ అమాంతం పెరిగింది. తాజాగా ఆర్సీబీ జట్టు 11 కోట్లతో మ్యాక్స్వెల్ ను రిటైన్ చేసుకోవడంతో ఐపీఎల్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసాడు. మ్యాక్స్ వెల్ మాట్లాడుతూ “IPL బహుశా నేను ఆడే చివరి టోర్నమెంట్ కావచ్చు. నేను ఇకపై నడవలేని వరకు IPL ఆడతాను. నా కెరీర్ మొత్తంలో IPL నాకు ఎంతో మేలు చేసింది. నేను కలుసుకున్న వ్యక్తులు, నేను ఆడిన కోచ్‌లు నన్ను ప్రోత్సహించిన తీరు మర్చిపోలేను.

IPL Season 17 : ఒక్క ప్లేయర్ కోసం గట్టిగా వేలం..

అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఐపీఎల్ టోర్నమెంట్ నా కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడింది”. అని మెల్‌బోర్న్ విమానాశ్రయంలోని విలేకరులతో చెప్పాడు. AB డివిలియర్స్, విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ప్లేయర్ల మీద భుజాల మీద చేతులు వేసుకొని మాట్లాడడం ఏ ఆటగాడికైనా గొప్ప అనుభూతి అని తన అనుభవాలు గుర్తు చేసుకున్నాడు. 2012లో IPL అరంగేట్రం చేసిన గ్లెన్ మాక్స్‌వెల్.. తన IPL కెరీర్‌లో ఇప్పటి వరకు 124 మ్యాచ్‌లు ఆడాడు. 26.40 సగటుతో 2719 పరుగులతో పాటు 18 హాఫ్ సెంచరీలు కూడా చేసాడు. మ్యాక్స్ వెల్ ఐపీఎల్ అత్యధిక స్కోరు 95 పరుగులు కాగా.. తన ఐపీఎల్ కెరీర్‌లో 226 ఫోర్లు, 158 సిక్సర్లు కొట్టాడు ఉన్నాయి. ఇటీవలే భారత్ తో మూడో టీ20 మ్యాచ్ లో సెంచరీ చేసి ఆసీస్ కు సంచలన విజయాన్ని అందించిన ఈ స్టార్ ఆటగాడు ఆ తర్వాత స్వదేశానికి వెళ్ళిపోయాడు.