Ravindra Jadeja: ఐసీసీ టెస్ట్ ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆటగాళ్ళు దుమ్ము రేపుతున్నారు. ఎక్కువగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆధిపత్యం కనబరిచిన మన ప్లేయర్స్.. ఈ సారి ఆల్ రౌండర్ జాబితాలో కూడా డామినేట్ చేశారు. టెస్ట్ ర్యాంకింగ్స్ ఆల్ రౌండర్ జాబితాలో టాప్ ఫైవ్‌లో ఏకంగా ముగ్గురు భారత క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న రవీంద్ర జడేజా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
Shanmukh Jaswanth: అమ్మాయిని బెదిరించి అన్న.. గంజాయి తాగుతూ తమ్ముడు.. ఇలా దొరికేశారు..!
మూడో టెస్టులో రవీంద్ర జడేజా సెంచరీ చేయడంతోపాటు ఈ మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. రాజ్‌కోట్ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన జడేజా ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో 469 రేటింగ్ పాయింట్లు సాధించాడు. అతని టెస్టు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు. జడేజాతోపాటు, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అశ్విన్ 330 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, అక్షర్ పటేల్ 281 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతకుముందు అక్షర్ పటేల్ ఐదో స్థానంలో ఉన్నారు.
కానీ, బెన్ స్టోక్స్ పేలవ ప్రదర్శనతో లాభపడిన అక్షర్.. స్టోక్స్ వెనక్కి నెట్టి ఒక స్థానం పైకి వెళ్లాడు. తద్వారా ఆల్ రౌండర్ల జాబితాలో భారత్ పూర్తి ఆధిపత్యం కనిపిస్తోంది. దీన్ని బట్టి టీమిండియా విజయంలో ఆల్ రౌండర్ల రోల్ ఎంత ఉందో అర్థమవుతోంది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టుకు ఇరు జట్లూ సిద్ధమవుతున్నాయి.