India Bowling : బౌలింగ్ కోచ్ గా బహుతులే.. మోర్కెల్ ఎంట్రీ మరింత ఆలస్యం

భారత బౌలింగ్ కోచ్ నియామకంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గంభీర్ సిఫార్సు చేసిన సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ పేరు దాదాపుగా ఖారరైంది.

భారత బౌలింగ్ కోచ్ నియామకంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గంభీర్ సిఫార్సు చేసిన సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ పేరు దాదాపుగా ఖారరైంది. అయితే అతని స్థానంలో బౌలింగ్ కోచ్ గా ఇప్పుడు సాయిరాజ్ బహుతులే శ్రీలంకతో సిరీస్ కు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. మోర్కెల్ వ్యక్తిగత కారణాలతో కొంత ఆలస్యంగా రానుండడంతో శ్రీలంక టూర్ కు సాయిరాజ్ బహుతులేను ఎంపిక చేసినట్టు సమాచారం. మహారాష్ట్రకు చెందిన సాయిరాజ్ బహుతులే భారత్ తరపున 10 టెస్టులు 10 వన్డేలు ఆడాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతనికి అద్భుతమైన రికార్డుంది. ఆల్ రౌండర్ గా రాణించాడు. లెగ్ బ్రేక్ బౌలర్ గా 630 వికెట్లు పడగొట్టడంతో పాటు 6 వేలకు పైగా పరుగులు చేశాడు.

దేశవాళీ క్రికెట్ లో కేరళ , బెంగాల్ రంజీ జట్లకు పనిచేసిన బహుతులే 2021లో భారత్ ఏ జట్టుకూ సేవలందించాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు స్పిన్ కోచ్ గా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో స్పిన్ బౌలింగ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలో పనిచేస్తున్నాడు. గతంలో ప్రధాన కోచ్ ద్రావిడ్ అందుబాటులో లేనప్పుడు పలు సందర్భాల్లో లక్ష్మణ్ తో కలిసి భారత జట్టుకు సేవలందించాడు. మోర్కెల్ భారత జట్టుతో చేరే వరకూ బహుతులే బౌలింగ్ కోచ్ గా కొనసాగనున్నాడు.