Yazvendra Chahal : బక్కోడు డబుల్ సెంచరీ కొట్టాడు…

ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ (Rajasthan) స్టార్ స్పిన్నర్ (Star Spinner) యజ్వేంద్ర చాహల్ (Yazvendra Chahal) చరిత్ర సృష్టించాడు.

 

 

 

ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ (Rajasthan) స్టార్ స్పిన్నర్ (Star Spinner) యజ్వేంద్ర చాహల్ (Yazvendra Chahal) చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ (IPL) చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. మహ్మద్ నబీ (Mohammad Nabi) వికెట్ తీసుకోవడం ద్వారా అతను ఈ రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఈ ఘనత సాధించలేదు. చాహల్ 153 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 200 వికెట్లు పడగొట్టాడు. ఈ లిస్ట్ లో
విండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో రెండో ప్లేస్ లో ఉన్నాడు. అతడు 161 మ్యాచ్ ల్లో 183 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత పియూష్ చావ్లా 181 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 174 , అమిత్ మిశ్రా 171 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు 13 వికెట్లు తీసిన చాహాల్ పర్పుల్ క్యాప్ హోల్డర్ గా బుమ్రా, హర్షల్ పటేల్ తో నిలిచాడు. దీంతో బక్కోడే కానీ సూపర్ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.