RCB : బెంగుళూరు ప్లే ఆఫ్ చేరాలంటే..?

ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్లేఆఫ్స్ ఆశలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని అద్భుతాలు జరిగితే ముందంజ వేస్తుంది.

ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్లేఆఫ్స్ ఆశలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని అద్భుతాలు జరిగితే ముందంజ వేస్తుంది. సీజన్ ఫస్టాఫ్ లో వరుస పరాజయాలతో నిరాశ పరిచిన బెంగుళూరు…సెకండాఫ్ లో మాత్రం వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచింది. ప్రస్తుతం 12 మ్యాచ్ లలో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ఏడో ప్లేస్ లో కొనసాగుతోంది. ఆర్సీబీ మిగిలిన రెండు మ్యాచ్లలో గెలిస్తే.. 14 పాయింట్లు వస్తాయి. అయినా కూడా ప్లేఆఫ్స్కి చేరడం కష్టమే. అప్పుడు కూడా మిగిలిన జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది.

రాజస్థాన్ పై చెన్నై , లక్నో చేతిలో ఢిల్లీ , ముంబై చేతిలో లక్నో ఓడిపోవాలి. అంతే కాదు గుజరాత్ తన చివరి మ్యాచ్లలో కనీసం ఒకటి ఓడిపోవాలి. ఇలా జరిగితే.. ఆర్సీబీ, లక్నో 14 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. లక్నోతో పోల్చుకుంటే.. ఆర్సీబీ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటం అడ్వాంటేజ్. అయితే చెన్నై రెండు మ్యాచ్లు గెలిస్తే సన్ రైజర్స్ తన చివరి మ్యాచ్లలో ఓడిపోవాలని ఆర్సీబీ ప్రార్థించాలి. అలాగే కోల్ కతా చేతిలో ఓడిపోవాలి. ఇక లక్నో అన్ని మ్యాచ్లలో చేతులెత్తేయాలి. పైన చెప్పినట్టు జరిగితే.. ఆరు జట్లకు 14 పాయింట్స్ ఉంటాయి. నెట్ రన్రేట్ మెరుగ్గా ఉన్న రెండు టీమ్స్ ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్కి వెళతాయి. ఆర్సీబీకి అవకాశం ఉంటుంది.