Soumya Sarkar: బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ గడ్డపై భారీ శతకంతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. 14 ఏళ్ల పాటు భద్రంగా ఉన్న క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించాడు. భారీ శతకంతో చెలరేగిన సౌమ్య.. ఐదేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ చేశాడు.
Mohammed Shami: మహ్మద్ షమీకి అర్జున అవార్డ్.. కేంద్ర అవార్డుల ప్రకటన
అయితే, ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 151 బంతుల్లోనే 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 169 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌమ్య.. ఉపఖండం జట్ల తరఫున న్యూజిలాండ్ గడ్డపై ఒక వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు సచిన్ పేరిట ఈ రికార్డు ఉండేది. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉపఖండం జట్ల తరపున బ్లాక్ క్యాప్స్ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సౌమ్యా నిలిచాడు. సచిన్ 2009లో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన వన్డేలో 163 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇదే ఇప్పటివరకూ ఉపఖండం జట్ల తరఫున కివీస్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు. విదేశాల్లో బంగ్లాదేశ్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ ఘనత సాధించాడు. కొన్నాళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సౌమ్యా.. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లోనూ బంగ్లాదేశ్ జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పుడు వచ్చీ రాగానే.. అదీ న్యూజిలాండ్ గడ్డపై చెలరేగాడు.