India World Cup Squad: ప్రపంచ కప్ జట్టు ఎంపిక.. కేఎల్ రాహుల్‌కు చోటు..

ఇండియా చివరిసారిగా వరల్డ్ కప్ సహా ఐసీసీ టోర్నీ నెగ్గి చాలా కాలం అవుతోంది. 2011లో వరల్డ్ కప్, 2013లో ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. అప్పటినుంచి ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా భారత్ నెగ్గలేదు.

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 03:52 PM IST

India World Cup Squad: వచ్చే నెల నుంచి స్వదేశంలో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ 2023కి భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. అందరూ ఊహించినట్లుగానే కేఎల్ రాహుల్‌కు చోటు దక్కింది. సంజూ శాంసన్‌కు చోటు దొరకలేదు. ఆసియా కప్‌లో సత్తా చాటిని ఇషాన్ కిషన్‌ను కూడా బీసీసీఐ ఎంపిక చేయడం విశేషం. దాదాపు అందరూ ఊహించినట్లుగానే జట్టు కూర్పు ఉంది. భారీ మార్పులేమీ లేవు. కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు వరల్డ్ కప్‌లో పాల్గొనబోతుంది.
ఇండియా చివరిసారిగా వరల్డ్ కప్ సహా ఐసీసీ టోర్నీ నెగ్గి చాలా కాలం అవుతోంది. 2011లో వరల్డ్ కప్, 2013లో ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. అప్పటినుంచి ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా భారత్ నెగ్గలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా స్వదేశంలో వరల్డ్ కప్ గెలుచుకోవాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. దీనికి అనుగుణంగానే తుది జట్టును ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. జట్టులో చోటు కోసం ఎదురు చూసిన తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణ, రవి చంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌‌దీప్ సింగ్‌లకు చోటు దక్కలేదు. నిజానికి ఇటీవల ప్రకటించిన ఆసియా కప్ జట్టునే ప్రపంచ కప్‌నకు ఎంపిక చేస్తామని సెలక్షన్ కమిటీకి చెందిన అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించారు. దీనికి అనుగుణంగానే తుది జట్టు ఉంది. ప్రపంచ కప్‌నకు ఎంపికైన భారత జట్టు ఇదే. రోహిత్ శర్మ, గిల్ భారత జట్టు బ్యాటింగ్‌ను ఆరంభిస్తారు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.