BCCI: బీసీసీఐ నిర్ణయంతో ఆఫ్ఘనిస్తాన్‌కు షాక్.. అసలు విషయం ఏంటంటే..

జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ 3 వన్డేల సిరీస్ ఆడాల్సి ఉండగా, అది వాయిదా పడింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత, బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ సిరీస్ ఎప్పుడు జరుగుతుందో తెలియజేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, జూన్ 23 నుంచి జూన్ 30 వరకు ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను ఆడాల్సి ఉంది.

BCCI: ప్రపంచకప్‌కు ముందు భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య వన్డే సిరీస్ ఆడబోమని అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశారు. భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ దాదాపు 6 నెలల పాటు వాయిదా పడింది. జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ 3 వన్డేల సిరీస్ ఆడాల్సి ఉండగా, అది వాయిదా పడింది.

అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత, బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ సిరీస్ ఎప్పుడు జరుగుతుందో తెలియజేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, జూన్ 23 నుంచి జూన్ 30 వరకు ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను ఆడాల్సి ఉంది. ఇది రెండు బోర్డుల పరస్పర అంగీకారంతో వాయిదా పడిందంట. ప్రపంచకప్‌నకు ముందు ఎలాంటి సిరీస్‌లు ఉండవని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. ఇప్పుడు వచ్చే ఏడాది జనవరిలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఆసియా క్రీడల్లో టీమ్ ఇండియా భాగస్వామ్యాన్ని కూడా ఆయన ధృవీకరించాడు.

సెప్టెంబరు 23న చైనాలో ప్రారంభమయ్యే ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు పాల్గొంటుందని చెప్పుకొచ్చాడు. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత పురుషుల, మహిళల జట్టుకు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని చెప్పారు.