BCCI : సంజూకు బీసీసీఐ షాక్…

ఐపీఎల్ 17 (IPL) వ సీజన్ టైటిల్ రేసులో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals) చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

 

 

 

ఐపీఎల్ 17 (IPL) వ సీజన్ టైటిల్ రేసులో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals) చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కేప్టెన్ సంజు శాంసన్ ఒంటరిపోరాటం చేశాడు. ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 86 పరుగులు చేశాడు. అయితే సంజు శాంసన్ అవుట్ అయిన విధానం దుమారం రేపింది. ఇన్నింగ్ 16వ ఓవర్‌ నాలుగో బంతికి భారీ షాట్ కొత్తగా షై హోప్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఆ సమయంలో అతని పాదాలు బౌండరీ లైన్‌ను టచ్ అయినట్టు కనిపించింది.

దీంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ ను సంప్రదించారు. పలుసార్లు రీప్లే ను పరిశీలించిన అనంతరం చివరికి థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కావడంతో సంజు శాంసన్ ఫీల్డ్ అంపైర్లతో ఆర్గ్యుమెంట్స్‌కు దిగాడు. కొద్దిసేపు వాదిస్తూ క్రీజ్‌ను వదలడానికి ఇష్టపడలేదు. ఇది సంజు శాంసన్‌పై భారీ పెనాల్టీకి దారి తీసింది. అతనికి చెల్లించే మ్యాచ్ ఫీజులో నుంచి 30 శాతం మేర కోత పడింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. అంపైర్లతో వాగ్వివాదానికి దిగడం, అవుట్ ఇచ్చిన తరువాత క్రీజ్‌ను వదలకపోవడం వంటి చర్యలు ఉల్లంఘన కిందికి వస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని 30 శాతం మేర ఫీజులో కోత పెట్టారు. సంజూ ఔట్ తర్వాత ఢిల్లీ విజయం ఖాయమయింది. సంజూ ఔట్ పై రాజస్థాన్ కోచ్ సంగక్కర కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.