Kohli : కోహ్లీకి షాక్ ఇచ్చిన బీసీసీఐ..

ఐపీఎల్ 17 (IPL 17) వ సీజన్ లో ఆర్సీబీ (RCB) ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి (Virat Kohli) అవుటైన తీరు వివాదానికి దారి తీసింది.

 

 

 

ఐపీఎల్ 17 (IPL 17) వ సీజన్ లో ఆర్సీబీ (RCB) ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి (Virat Kohli) అవుటైన తీరు వివాదానికి దారి తీసింది. హర్షిత్‌ రాణా ఫుల్‌టాస్‌ బాల్‌ను కోహ్లి హైట్‌ నోబాల్‌గా భావించి డిఫెన్స్‌ ఆడాడు. బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి గాల్లోకి లేవగానే హర్షిత్‌ రాణా రిటర్న్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఈ క్రమంలో ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ తనను అవుట్‌గా ప్రకటించడంతో కంగుతిన్న కోహ్లి రివ్యూ కోరాడు. రీప్లేలో బాల్‌ నడుము కంటే ఎత్తులో వచ్చినట్లు కనిపించినా కోహ్లి క్రీజు వెలుపల ఉన్నాడంటూ థర్డ్‌ అంపైర్‌ కూడా ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని సమర్థించాడు.

దీంతో ఆగ్రహానికి లోనైన కోహ్లి ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ దగ్గరకు వెళ్లి వాదనకు దిగాడు. నో బాల్‌ అయినా తనను ఎందుకు అవుట్‌గా ప్రకటించారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన కోపాన్ని వెళ్లగక్కుతూ తల అడ్డంగా ఊపుతూ డగౌట్‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

కాగా అంపైర్లతో దురుసుగా ప్రవర్తించాడనే కారణంగా విరాట్‌ కోహ్లిపై బీసీసీఐ (BCCI) క్రమశిక్షణా చర్యలకు దిగింది . కేకేఆర్‌ (KKR) తో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.8లో భాగమైన లెవల్‌ 1 నేరానికి పాల్పడ్డాడని పేర్కొంది.ఈ విషయాన్ని మ్యాచ్‌ రిఫరీ ఎదుట కోహ్లి అంగీకరించాడని.. అయితే, అతడి తప్పునకు శిక్షగా మ్యాచ్‌ ఫీజులో యాభై శాతం మేర కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. కాగా కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో కలిపి 379 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్నాడు.