మ్యాచ్ స్థితిగతుల్ని బట్టి, తన గేర్ ఛేంజ్ చేస్తూ అపోజిషన్ టీమ్కు పెద్ద తలనొప్పిగా మారుతుంటాడు. రైజర్స్ కోసం బరిలో దిగుతున్న మరో అండర్ ఎస్టిమేట్ ఆటగాడు యశస్వి జైస్వాల్. ఈ యువ సంచలనం రీసెంట్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఓపెనర్ గా వచ్చే జైస్వాల్, ఈ ఐ పి ఎల్ లో కొంచెం సత్తా చాటినా కూడా టీమిండియా నుంచి పిలుపును అందుకుంటాడు. దానికోసం, మొదటి మ్యాచ్ నుంచే బ్యాట్ ను సానపెట్టాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ కు జైస్వాల్ రూపంలో పెద్ద ముప్పు పొంచివుందని గుర్తించాలి. రాయల్స్ జట్టు నమ్ముకున్న మూడో ఆటగాడు యుజువేంద్ర చాహల్. స్పిన్ కి కాస్త అనుకూలించినా కూడా చాహల్, క్రికెట్ కు బదులు ప్రత్యర్థితో కబడ్డీ ఆడుకుంటుంటాడు.
ఈ మెజీషియన్ బౌలర్ ను సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్, ఏ నిమిషంలో అయినా అశ్రద్ధ చేసినా, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సంజూ జట్టు నుంచి ఈరోజు షైన్ కాబోయే మరో ఆటగాడు జాస్ బట్లర్. ఐ పి ఎల్ 2023 కి సంబంధించిన ప్రతి అభిమాని ఆరెంజ్ క్యాప్ ప్రెడిక్షన్ లో ఉండే ఆటగాడు బట్లర్. రాజస్థాన్ రాయల్స్ స్కోర్ బోర్డుకు పెద్దన్నలా నిలబడి, బ్యాటింగ్ లో అన్నీ తానై చూసుకుంటూ ఉంటాడు, సో, బట్లర్ కు చెక్ పెడితే, భువీ జట్టుకు సగం టెన్షన్ ఉండదు. ఈ నలుగురు కీలక ఆటగాళ్లతో పాటు, జాసన్ హోల్డర్, దేవదూత్ పడిక్కాల్ లు కూడా సన్ రైజర్స్ జట్టుకు ప్రమాదకరంగా మారనున్నారు.