టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) లో విరాట్ కోహ్లీ (Virat Kohli) పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ (IPL) 17వ సీజన్ పరుగుల వరద పారించిన కోహ్లీ మెగా టోర్నీ (Kohli mega tourney) లో మాత్రం ఫెయిలవుతున్నాడు. దీంతో పలువురు పాక్ మాజీలు విరాట్ పై విమర్శలు గుప్పించారు. దీంతో టీమిండియా (Team India) మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కోహ్లీకి అండగా నిలిచాడు.
కోహ్లీ వైఫల్యానికి అతని తప్పు లేదని, పిచ్ లనే నిందించాడు. ఇలాంటి పిచ్ లపై బ్యాటింగ్ చేయడం చాలా కష్టమన్నాడు. ప్రస్తుతం కోహ్లీ పరుగులు చేయకపోవడానికి ఈ పిచే కారణమని తేల్చేశాడు. అదే సమయంలో ఓపెనర్ గా వస్తున్నాడు కాబట్టి కోహ్లీపై కొద్దిగా ఒత్తిడి ఉండటం సహజమేనని హర్భజన్ చెప్పుకొచ్చాడు.
సూపర్ 8 మ్యాచ్ లు జరిగే విండీస్ పిచ్ లపై విరాట్ చెలరేగుతాడని వ్యాఖ్యానించాడు. పవర్ ప్లేలో రోహిత్, విరాట్ మంచి ఆరంభాన్ని ఇస్తే.. తర్వాత బ్యాటింగ్ కు వచ్చే పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే తమ ఆటతీరుతో దూసుకుపోతారని భజ్జీ అభిప్రాయపడ్డాడు.