బూమ్ బూమ్ బుమ్రా (Bumrah)… అంటోంది క్రికెట్ వరల్డ్(Cricket World). ఈ స్పీడ్ స్టర్ బౌలింగ్ (Speedster Bowling) లో ఓవైపు గ్రౌండ్‌లో బెయిల్స్ ఎగురుతున్నాయి. ఇంకోవైపు.. రికార్డుల మోత మోగుతోంది. లేటెస్ట్‌గా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ (ICC Test Rankings)లో అదరగొట్టాడు బుమ్రా. నంబర్ వన్ బౌలర్‌గా ఎదిగాడు. దీంతో.. మూడు ఫార్మాట్‌లలో టాప్ ర్యాంక్ సాధించిన ఫస్ట్ ఇండియన్ పేసర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు బుమ్రా.
టీమిండియా స్టార్ (Team India Star) పేసర్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. విశాఖ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆట కట్టించిన బుమ్రా.. టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్‌ను ఎగురేసుకుపోయాడు. అంతేకాకుండా టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంక్‌ను సాధించిన మొదటి భారత ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడీ స్పీడ్ స్టర్. ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్‌లో నెంబర్ వన్‌లో ఉన్నాడు బుమ్రా. ఇప్పుడు టెస్టుల్లోనూ ఫస్ట్ ర్యాంక్ రావడంతో.. మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకున్న రెండో ఏషియన్ ప్లేయర్‌గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. అయితే.. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గతంలోనే విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాడు.
టీమిండియా తరపున 34 టెస్టు మ్యాచులు ఆడిన బుమ్రా.. ఇప్పటి వరకూ 10 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే 150 వికెట్ల క్లబ్‌లో చేరాడీ స్పీడ్‌స్టర్. గతంలో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం వరకు వచ్చిన బుమ్రా.. టాప్‌లోకి మాత్రం రాలేకపోయాడు.. వైజాగ్ టెస్టులో సంచలన బౌలింగ్‌తో ఈ యార్కర్ కింగ్ 881 రేటింగ్ పాయింట్స్ సాధించాడు. మూడు స్థానాలు ఎగబాకాడు. గత ఏడాది మార్చి నుంచి అగ్ర స్థానంలో కొనసాగుతున్న అశ్విన్‌ను అధిగమించాడు. నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ రెండో స్థానంలో నిలవడంతో అశ్విన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రా కంటే ముందు టీమిండియా నుంచి ముగ్గురు స్పిన్నర్లు టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, బిషన్ సింగ్ బేడీ ఈ ఘనత సాధించారు.