Zaheer Khan: జహీర్ ఖాన్ వర్సెస్ అండర్సన్

 ప్రపంచ క్రికెట్ లో స్వింగ్ పాఠాలకు సంబంధించి టీమిండియా బౌలర్ జహీర్ ఖాన్, ఇంగ్లాండ్ లెజెండ్ జేమ్స్ అండర్సన్ లు ఖచ్చితంగా తమ వైవిధ్యంతో తరువాతి తరాలకు టిప్స్ అందించిన వారే.

  • Written By:
  • Publish Date - June 19, 2023 / 04:35 PM IST

వీరిద్దరూ కూడా తమ జాతీయ జట్లకు ఒక పదేళ్ల పాటుగా అద్భుతమైన ఓపెనింగ్ బౌలింగ్ ని అందించారు. జేమ్స్ అయితే ఇప్పటికీ టెస్టు క్రికెట్ ఫార్మాట్లో రికార్డులు సృష్టిస్తూ, దూసుకెళ్తున్నాడు. 2000 సంవత్సరం నుంచి, 2009 వరకు కూడా, వీరు ఆడిన వన్ డే ఫార్మాట్ లకు సంబంధించిన కంపారిజన్ ను చూస్తే, జహీర్ ఖాన్ ఆ మధ్య కాలంలో మొత్తం 167 వన్ డే మ్యాచులాడాడు. ఇందులో ఖాన్ ఏకంగా 232 వికెట్లతో తన హవాను చాటాడు.

ఇక ఇంగ్లాండ్ కోసం జిమ్మీ, ఆ పదేళ్లలో మొత్తం 120 వన్ డే మ్యాచులు ఆడాడు. ఇందులో మొత్తం 161 వికెట్లను నేల కూల్చాడు. జహీర్ అథైతమా బౌలింగ్ ప్రదర్శన, ఫైవ్ ఫర్ ఫార్టీ టూ. జిమ్మీ బెస్ట్ బౌలింగ్ ఫైవ్ ఫర్ ట్వంటీ త్రీ. ఈ ఇద్దరు లెజెండ్స్ కూడా ఆ పీరియడ్ గ్యాప్ లో చెరోసారి ఫైవ్ వికెట్ హౌల్ ను అందుకున్నారు. జహీర్ మొత్తం 101 మేడిన్ ఓవర్లు సంధించగా, అండర్సన్ 80 ఓవర్లలో పరుగులేమి ఇవ్వలేదు. ఇద్దరు కూడా కొంచం అటు ఇటుగా సమాన బౌలింగ్ సగటును కలిగి ఉన్నారు.