భారత్, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఈ సారి హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా అయితే ఈ సిరీస్ పై పెద్ద ఆసక్తి ఉండేది కాదు. కానీ పాక్ గడ్డపై బంగ్లాదేశ్ సంచలన ప్రదర్శన తర్వాత టీమిండియా అప్రమత్తమైంది. పూర్తిస్థాయి జట్టుతో బంగ్లాదేశ్ పై బరిలోకి దిగుతోంది. అటు బంగ్లాదేశ్ టీమ్ లో యువ పేసర్ నహీద్ రానా సవాల్ విసురుతున్నాడు. పాక్ తో సిరీస్ లో నహీద్ గంటకు 150 కిమ.మీ వేగంతో బౌలింగ్ చేశాడు. బుల్లెట్ లాంటి బంతులతో పాక్ బ్యాటర్లను కంగారెత్తించాడు. ఒక ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కూడా తీశాడు. ఈ 21 ఏళ్ళ యువ పేసర్ ఇప్పుడు భారత్ పైనా బంగ్లాదేశ్ కు కీలకం కానున్నాడు. అతని బౌలింగ్ ను ఎదుర్కొనే క్రమంలో అప్రమత్తంగా లేకుంటే మన బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు.