బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్, సినిమా హీరోస్ కి కూడా క్రికెట్ లో ఫేవరేట్ హీరోలు ఉన్నారు అయితే ఇప్పుడు ఏకంగా బ్రిటన్ ప్రధానికి ఇండియన్ క్రికెట్ లో ఒకరు తనకు ఎంతగానో ఇష్టమని చెప్పుకొచ్చాడు. అయితే ఈ లిస్టులో సచిన్, కోహ్లీ లాంటి వారికి స్థానం ఇవ్వలేదు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా ఉంటున్న రిషి సునక్.. భారత సంతతికి చెందినవారే అని అందరికీ తెలుసు. వీరిది పంజాబ్. ఇంగ్లాండ్ కి వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. ఇక ఈ క్రమంలో రిషి సునక్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు అక్షరా మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవలే లార్డ్స్ టెస్టు చూసిన ప్రధాని.. ఈ మ్యాచ్ ని బాగా ఎంజాయ్ చేసాడు. ఆ తర్వాత ఈ టెస్టు మ్యాచ్ అనంతరం బీసీసీకి ఇంటర్వ్యూ ఇచ్చిన రిషి సునక్.. క్రికెట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు.
ఈ క్రమంలో తన ఫేవరేట్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అని చెప్పుకొచ్చాడు. బ్రిటన్ ప్రధాని మాట్లాడుతూ “‘రాహుల్ ద్రావిడ్ నా ఫేవరేట్ క్రికెటర్. అతని టెక్నిక్ మాత్రమే కాదు ద్రవిడ్ లో అన్ని విషయాలు నాకు నచ్చుతాయి. కామ్ అండ్ కూల్ యాటిట్యూడ్, వ్యక్తిత్వం లాంటి విషయాలు అతన్ని ప్రత్యేకంగా మార్చాయి”. అని రిషి సునక్ చెప్పుకొచ్చారు. ఇక తన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ.. “నాకు ఉద్యోగం చేయమంటే అసలు ఇష్టం ఉండేది కాదు. స్పోర్ట్స్ ఆడడం, చూడడం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తా. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌కి తొలి వికెట్ పడగానే లేచి గట్టిగా అరవాలని అనుకున్నా, వెంటనే నా పదవి గుర్తొచ్చి కూర్చుండిపోయా” అంటూ కామెంట్ చేశాడు. ఇక ఈ సందర్భంగా ‘2008లో జరిగిన చెన్నై టెస్టు గురించి మాట్లాడుతూ ఆ మ్యాచులో సచిన్ బ్యాటింగ్ కి నేను ఫిదా అయ్యాను అని తెలియజేసాడు. మొత్తానికి ఇంగ్లాండ్ ప్రధాని, రాహుల్ ద్రవిడ్ తన ఫేవరేట్ అని చెప్పడంతో తన టేస్ట్ ఏంటో తెలియజేసాడు.