యార్కర్ల కింగ్ వచ్చేశాడు ప్రాక్టీస్ మొదలుపెట్టిన బూమ్రా

భారత క్రికెట్ జట్టు హాలిడేస్ ముగింపుదశకు చేరుకున్నాయి. దాదాపు ఏడు వారాల విశ్రాంతి దొరకడంతో పలువురు సీనియర్లు కుటుంబాలతో వెకేషన్లకు వెళ్ళిపోయారు.

  • Written By:
  • Publish Date - September 3, 2024 / 04:50 PM IST

భారత క్రికెట్ జట్టు హాలిడేస్ ముగింపుదశకు చేరుకున్నాయి. దాదాపు ఏడు వారాల విశ్రాంతి దొరకడంతో పలువురు సీనియర్లు కుటుంబాలతో వెకేషన్లకు వెళ్ళిపోయారు.ఇప్పుడు ఒక్కొక్కరుగా తిరిగి వస్తూ మళ్ళీ గ్రౌండ్ లో అడుగుపెడుతున్నారు. తాజాగా యార్కర్ల కింగ్ , స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ కు ముందు నెట్స్ లో చెమటొడ్చుతున్నాడు. ఇక్కడ నుంచి వరుసగా టెస్ట్ సిరీస్ లే ఉండడంతో బూమ్రాతో పాటు ప్రధాన ఆటగాళ్ళంతా మళ్ళీ బిజీ కానున్నారు. అయితే బూమ్రాను బంగ్లాతో సిరీస్ కు ఎంపిక చేస్తారా లేదా అనేది చూడాలి. సెలక్టర్లు అతనికి విశ్రాంతివ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే బూమ్రా ఆస్ట్రేలియాతో సిరీస్ లోనే మళ్ళీ బరిలోకి దిగుతాడు.