Dinesh Karthik: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ ఓటమిని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అటు మాజీ క్రికెటర్లు సైతం జట్టు ప్రదర్శనపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రెండురోజుల పాటు ఆధిపత్యం కనబరిచి, తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సాధించి మరీ మ్యాచ్ ఓడిపోవడం విస్మయాన్ని కలిగించింది. తాజాగా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
IND Vs ENG: విశాఖలో టీమిండియా రికార్డులివే.. రెండో టెస్టులో గెలిచేనా..?
రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీ టీమిండియా ఓటమికి కారణమైందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.. ఫీల్డ్ సెటప్‌లో రోహిత్ శర్మ చేసిన తప్పిదాలు ఇంగ్లండ్‌కు కలిసొచ్చాయని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా ఫీల్డ్ సెటప్ సరిగ్గా లేదన్నాడు. టీమిండియా మరీ రక్షణాత్మక ధోరణిలో ఆడిందని, టామ్ హార్ట్‌లే వంటి అరంగేట్ర ప్లేయర్ ఆడుతున్నప్పుడు కూడా చెత్త ఫీల్డ్ సెటప్ చేశాడంటూ విమర్శించాడు. అతను పరుగులు రాబడుతుంటే.. అడ్డుకోలేకపోయారన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో హార్ట్‌లే 34 పరుగులు చేశాడు. అతని రన్సే టీమిండియా ఓటమికి కారణమైంది.
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి టాప్ స్పిన్నర్లను ఎదుర్కొని పరుగులు చేసే అవకాశం కల్పించారంటూ దినేశ్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. రోహిత్ ఇలాంటి ఫీల్డింగ్ సెటప్ పెడతాడని ఊహించలేదంటూ డీకే కామెంట్స్ చేశాడు. తొలి టెస్టులో భారత్ 231 పరుగుల టార్గెట్ ను ఛేదించడంలో విఫలమై పరాజయం పాలైంది.