మరీ ముఖ్యంగా టాప్ ఆర్డర్‌తోపాటు లోయర్ ఆర్డర్‌లో ఆ జట్టు వికెట్ కీపర్ అలెక్స్ కేరీ.. విలువైన 48, 66 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా హాఫ్ సెంచరీ సాధించాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లోనూ కేరీ ఆడుతున్నాడు. తొలి టెస్టులోని మొదటి ఇన్నింగ్స్‌లో 66 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లోనూ విలువైన 20 పరుగులను కేరీ చేశాడు. ఈ క్రమంలో ఇలా ఆడటానికి ప్రధాన కారణంగా ఇద్దరి పేర్లను చెప్పాడు. అందులో ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కాగా.. మరొకరు టీమ్‌ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ. డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా వీరిద్దరూ ఇచ్చిన సూచనల వల్లే మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నట్లు కేరీ పేర్కొన్నాడు.
‘ఇద్దరు సీనియర్ల నుంచి చాలా అంశాలు నేర్చుకున్నా. మరీ ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడకుండా ఉండాలని సూచించారు. ఇలాంటివి ఎందుకు ఆడతావు? అని అడిగారు. అందుకే, వారు చెప్పిందే వినడం తప్ప మరో మార్గం లేదు. కొన్నిసార్లు నేను అలాంటి షాట్లను నిర్లక్ష్యంగా ఆడి పెవిలియన్‌కు చేరేవాడిని. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లోనూ జడేజా బౌలింగ్‌లో ఇలానే ఔటయ్యా. అక్కడ అలాంటి షాట్ అవసరం లేకపోయినా ఆడేసి దొరికిపోయా. దీంతో స్పిన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా’’ అని తెలిపాడు. ఈ క్రమంలో ‘బజ్‌బాల్’ క్రికెట్‌పై వెనుకడుగు వేసే అవకాశం లేదని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పష్టం చేశాడు. తమ జట్టు అవలంబిస్తున్న దూకుడైన ఆటతీరును కొనసాగిస్తామని వెల్లడిస్తూ, యాషెస్ మీద మరిన్ని అంచనాలు పెంచేసాడు.