నిజానికి ఈ మ్యాచ్ గెలుస్తామని ధోనీ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఊహించనివిధంగా ఓడిపోయారు. మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఓకే.. లేదంటే ఇన్‌స్టాగ్రామ్ ఈరోజు దద్దరిల్లేది. ధోని స్ట్రైక్‌లో ఉన్నపుడు జాగ్రత్తగా ఆడాలని చాలా సార్లు నిరూపించాడు. కానీ అతను ఇంటర్నేషనల్ కేరిర్‌కి గుడ్‌బై చెప్పాడని చాలా మంది బౌలర్స్ లైట్ తీసుకుంటున్నారు.. బౌలర్ సందీప్‌శర్మ త్వరగా లైన్‌లోకి వచ్చాడు. లేకపోతే లాస్ట్ దాకా వచ్చిన మ్యాచ్ చేతులారా చెన్నైకి అప్పగించేవాళ్లు.
చివరి మూడు ఓవర్లలో 50 రన్స్ ఇచ్చారు రాజస్థాన్ బౌలర్స్. ఈ మ్యాచ్‌లో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్‌తో, చాలా ఎమోషన్స్‌తో పాటు కొన్ని ఆల్‌టైమ్ రికార్డ్స్ బద్దలయ్యాయి. ఇలా జరిగితే మన మీమర్స్ ఆగుతారా.. విశ్వరూపం చూపించారు. బట్లర్‌ని మొయిన్ ఆలి ఔట్ చేయడంతో.. ఇద్దరు ఇంగ్లాండ్ ప్లేయర్స్ కావడంతో బహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచిన ఫొటో వేసి ఫన్నీగా ట్రోల్స్ వేస్తున్నారు. మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ సామ్‌సన్ డకౌట్ అయ్యాడు.
ఇది అసలే వరల్డ్‌కప్ ఇయర్ అవ్వడంతో ఇండియా బ్యాటింగ్‌లో నెంబర్ 4 స్పాట్ కోసం చాలా పోటి ఉంది. ఈ టైమ్‌లో సంజూ కూడా ఇలాంటి ఫామ్‌లో ఉండటంతో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వాళ్ల క్లబ్‌లోకి సంజూని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్న ఫొటోస్ పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. అశ్విన్ నిన్నటి మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో విశ్వరూపం చూపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.. చెన్నై గ్రౌండ్ అశ్విన్‌కి హోమ్ స్టేడియం కావడంతో రాజస్థాన్ మేనెజ్మెంట్ మేము చెన్నై టీమ్‌ను ఓడించడానికి హోమ్ ప్లేయర్‌నే వాడాము అని మార్వెల్ విలన్ థానోస్‌తో కంపేర్ చేస్తూ ట్రోల్ చేసారు.
మ్యాచ్‌లోనే కాకుండా ధోని ఫ్యాన్స్ బయట కూడా చాలా ఎమోషన్స్‌ని బయటపెట్టారు.. మ్యాచ్ ఓడిపోయిందని బాధ లేదా అంటే ధోని బ్యాటింగ్ చూసి హ్యాపిగా ఫీలయ్యాం అంటున్నారు. మరి కొందరైతే.. అన్న హ్యాపిగా ఉంటే చాలు అంటూ మీమ్స్ వేస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ఆల్‌టైం రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి.. జియో సినిమా ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్‌లో దాదాపు 2.2 కోట్ల వ్యూస్‌తో రికార్డ్ స్థాయి వ్యూవర్‌షిప్ తెచ్చుకుంది.