IPL 2023: చెన్నైకి ఫస్ట్ ర్యాంక్.. ముంబైకి ర్యాంకే దక్కలేదు మరి రాయల్ ఛాలెంజర్స్ కి ?

ఐపీఎల్ 2023 సీజన్ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన ఐపీఎల్ జట్టుగా నిలిచింది. 'హౌలిహాన్ లోకీ' నివేదిక ప్రకారం ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 3.2 బిలియన్ల అమెరికా డాలర్లు. ఐపీఎల్ 2022 సీజన్‌తో పోల్చితే ఇది 80 శాతం ఎక్కువ.

  • Written By:
  • Publish Date - July 11, 2023 / 08:00 PM IST

ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌‌తో భారత క్యాష్ రిచ్ లీగ్ వాల్యూ 1.8 బిలియన్లు పెరిగింది. జట్ల బ్రాండ్ వాల్యూను పరిశీలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ మోస్ట్ బ్రాండ్ వాల్యూ టీమ్‌గా నిలిచింది. బిజినెస్ ఎంటర్‌ప్రైజ్ వాల్యూ ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానం సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉండటం గమనార్హం. బ్రాండ్ వాల్యూతో పాటు బిజినెస్ ఎంటర్‌ప్రైజ్ ర్యాంకింగ్స్‌లోనూ ఆర్‌సీబీ రెండో స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ 212 మిలియన్ అమెరికా డాలర్లు కాగా.. ఆర్‌సీబీ బ్రాండ్ వాల్యూ 195 మిలియన్ డాలర్లుగా ఉంది. 190 మిలియన్ డాలర్లతో ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉండగా 181 మిలియన్ డాలర్లతో కేకేఆర్ నాలుగో స్థానంలో నిలిచింది. గత సీజన్ వరకు ముంబై బ్రాండ్ వాల్యూ ఎక్కువగా ఉండగా.. తాజా సీజన్‌తో ఆ జట్టు టాప్ ర్యాంకు గల్లంతు అయ్యింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఐదేసి టైటిళ్లు గెలిచి మోస్ట్ బ్రాండ్ వాల్యూ కలిగి ఉండగా.. ఆర్‌సీబీ ఒక్క టైటిల్ గెలవకపోయినా ఆ జట్టు బ్రాండ్ వాల్యూ ఏ మాత్రం తగ్గలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్‌సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు. 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్.. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఓడి ఇంటిదారి పట్టింది. ఇక గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ సంచలన విజయంతో ఐదో టైటిల్ ఖాతాలో వేసుకుంది.