CSK: చెన్నై సూపర్ కింగ్స్ బలాలు.. బలహీనతలు..!!

IPL 2023 సీజన్ వచ్చేస్తోంది. 4 సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కూడా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. మరి ఈ జట్టు బలాలేంటి.. బలహీనతలేంటి..?

  • Written By:
  • Publish Date - March 3, 2023 / 01:38 PM IST

మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు చెన్నైసూపర్ కింగ్స్. ఎంతో కాంపిటీషన్ నడుమ, ధోని తన జట్టును ముందుండి నడిపిస్తూ, ముంబై జట్టుకు ఎదురొచ్చే ఏకైక జట్టుగా CSK ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. 2010 సంవత్సరంలో తొలిసారిగా విజేతగా నిలిచిన చెన్నై జట్టు, చివరగా 2021 లో ఛాంపియన్ అవతారంలో కనిపించింది. ఇప్పుడు IPL 2023కి సంబంధించి చెన్నై జట్టు అన్ని విధాలా, స్ట్రాంగ్ గా కనిపిస్తుంది.

ముందుగా చెన్నై బలం గురించి మాట్లాడితే, ఆ జట్టు కెప్టెన్ MS ధోనికి మించిన బలం ఇంకేముంటుంది అనేది చెన్నై అభిమానుల అభిప్రాయం. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే, ఓపెనర్లుగా ఋతురాజ్ గైక్వాడ్, డివోన్ కాన్వేలు ఉన్నారు. ఈ లెఫ్టుహ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబో, పవర్ ప్లేలో చెన్నై స్కోర్ బోర్డును పరుగులెత్తించగలరు. ఇక వన్ డౌన్ లో ఆల్ రౌండర్ మొయిన్ అలీ కూడా భారీ షాట్స్ తో అపోజిషన్ కు చుక్కలు చూపించగలడు. సెకండ్ డౌన్ కు సంబంధించి శివమ్ దూబే కాని, అంబటి రాయుడు కాని వచ్చే అవకాశం ఉంది, ఆ తరువాత ధోని, రవీంద్ర జడేజాలు కొండంత అండగా నిలుస్తారు. వీళ్ళ మధ్యలో ఇంగ్లాడ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా మెరుపులు మెరిపించగలడు. రాజవర్ధన్ హాంగార్గోకేర్ రూపంలో మరో ధోని కూడా చెన్నైలో ఉన్నాడు. అచ్చం ధోనీని పోలిన బ్యాటింగ్ విధ్వంసాలతో ఈ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్, ఈ IPLలో శివాలెత్తనున్నాడు. బౌలింగ్ లో కూడా సునాయాసంగా 145 కిలోమీటర్ల వేగంతో బ్యాట్స్ మెన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాడు. కివీస్ పైన్నేర్ మిచెల్ సాత్నార్ కూడా రెండు విధాలుగా CSKకు అండగా ఉండగలడు. లోకల్ బాయ్ శుబ్రాన్షు సేనాపతి కూడా మంచి క్రికెటింగ్ షాట్స్ తో పరుగులు చేయగల సత్తా ఉన్న ఆటగాడే. దీపక్ చాహర్, ముకేశ్ చౌదరీతో పాటు జూనియర్ మలింగా అని పిలవబడుతున్న శ్రీలంక ఆటగాడు మతీశ పతిరాన కూడా తన యార్కర్లతో సిద్ధమైపోయాడు. కైయిల్ జెమీసన్, తుషార్ దేశ్ పాండే, సీమర్ జీత్ సింగ్ లు కూడా ధోనికి సై అంటున్నారు.

ప్రతీ విభాగంలో పటిష్టంగా ఉన్న, ఈ ఛాంపియన్ జట్టు IPL అసలు సిసలు మజాను పంచుతూ ఉంటుంది. నలుగురు ఫారెన్ ప్లేయర్లు మాత్రమే ఉండాలన్న నిబంధన, వేరే జట్లను కన్ఫ్యూజ్ చేయచ్చేమో కాని, చెన్నై మాత్రం పర్ఫెక్ట్ టీమ్ తో ప్రతి మ్యాచులో బరిలోకి దిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ రూపంలో ది బెస్ట్ ఫారెన్ ఆల్ రౌండర్లు ఎలాగూ కచ్చితంగా జట్టులో ఉంటారు కాబట్టి, పోటీ అంత మిగతా ఇద్దరి విషయంలోనే తలెత్తుతుంది. ఓవరాల్ గా చెన్నై ప్రతిసారిలాగే ఇప్పుడు కూడా పటిష్టంగానే ఉంది. ఇక బలహీనతల విషయానికొస్తే, భారీ స్కోర్ సాధించే అవకాశం ఉన్నాకూడా ఒక్కో మ్యాచులో, సాధారణ స్కోర్ కే పరిమితం అవుతుంటారు. ఇది తప్ప చెన్నై ఆల్ గుడ్ అనే చెప్పుకోవాలి.